Begin typing your search above and press return to search.

మరో యంగ్‌ స్టార్‌ ఓటీటీ ఎంట్రీకి రెడీ

By:  Tupaki Desk   |   14 Sep 2021 2:30 PM GMT
మరో యంగ్‌ స్టార్‌ ఓటీటీ ఎంట్రీకి రెడీ
X
ఇండియాలో ఓటీటీలు చాలా స్పీడ్ గా విస్తరించాయి. కరోనా వల్ల రెట్టింపు వేగంతో ఓటీటీ మార్కెట్‌ పెరిగింది. 2025 వరకు ఇండియాలో ఓటీటీ మార్కెట్ పీక్స్ కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. కాని కరోనా వల్ల ఏడాదిన్నర కాలంగా థియేటర్లు మూత పడి ఉండటం వల్ల ఓటీటీ లే జనాలకు ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించాయి. అందుకే ఇండియాలో ఓటీటీల ఆధరణ అమాంతం పెరిగి పోయింది. సబ్‌స్క్రిప్షన్ తక్కువ ఉండటంతో పాటు ఎక్కువ కంటెంట్‌ ను ఇస్తున్న కారణంగా పలు ఓటీటీ లను వినియోగదారులు తీసుకుంటున్నారు. ఇండియాలో పెరిగిన ఓటీటీ వినియోగం కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా పెద్ద మొత్తంలో కంటెంట్‌ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యాయి. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వెబ్‌ సిరీస్ లను నిర్మించడంతో పాటు భారీ చిత్రాలను కూడా ఓటీటీ లో డైరెక్ట్‌ రిలీజ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఓటీటీ లు ముందు ముందు కాలంలో ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఆధరణ దక్కించుకుంటాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అందుకే స్టార్‌ హీరోలు కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ ప్రముఖ ఓటీటీ కి వెబ్‌ సిరీస్‌ చేసేందుకు ఓకే చెప్పాడు. వారం పది రోజుల్లోనే ఆ ఓటీటీ కంటెంట్‌ పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. షారుఖ్‌ స్థాయిలో భారీ బడ్జెట్‌ లో వెబ్‌ సిరీస్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక అదే దారిలో యంగ్ హీరో వరుణ్ దావన్ కూడా ఓటీటీ బాట పట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక అంతర్జాతీయ స్థాయి వెబ్‌ సిరీస్ ను రీమేక్ చేసేందుకు గాను అమెజాన్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అయ్యిందట. బాలీవుడ్ భారీ చిత్రాల రేంజ్ లో ఈ వెబ్‌ సిరీస్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. 9 ఎపిసోడ్‌ లకు గాను వరుణ్ ధావన్‌ భారీ మొత్తంలోనే పారితోషికంను దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

వరుణ్ దావన్ హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే ముందు ముందు మరింత మంది హీరోలు కూడా వెబ్‌ సిరీస్ లను చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. అమెజాన్‌ వారు ఇండియన్ స్టార్‌ హీరోలందరితో కూడా వెబ్‌ సిరీస్ లను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు లో ఇప్పటికే వెంకటేష్.. రానా మరియు నాగచైతన్యలు వెబ్‌ సిరీస్ లను చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. నాగార్జున కూడా వెబ్‌ సిరీస్‌ ను చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇలా హీరోలు స్టార్స్ హీరోయిన్స్‌ అంతా కూడా వెబ్ సిరీస్ లను చేస్తూ రాబోయే పదేళ్ల తర్వాత సినిమా అనేది ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.