రెడీ రెడీ.. తమన్నా రచ్చ ఓ రేంజ్ లో ఉందిగా!

Wed May 22 2019 14:32:36 GMT+0530 (IST)

Ready Ready Promo Song: What A Navel Feast

ప్రభుదేవా..తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 'అభినేత్రి 2' మే 31 న రిలీజ్ కానుంది. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీలో ఆడియన్స్ కు ఆసక్తి కలిగించే అంశం ప్రభు దేవా - తమన్నా కాంబో.   తాజాగా ఈ సినిమా నుండి 'రెడీ రెడీ' అంటూ సాగే ఒక వీడియో సాంగ్ ను విడుదల చేశారు.ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు సామ్ సిఎస్.  ఈ పాటను పాడినవారు నిన్సీ విన్సెంట్. సాహిత్యం అందించిన వారు వనమాలి. లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. "ఓ మై డార్లింగు బేబీ. నీకోసం ఈ రౌండ్ రౌండు జిలేబీ" అంటూ ఫన్నీ పదాలతో సాగింది.  ట్యూన్ కూడా క్యాచీగానే ఉంది.  ఇక మిల్కీ బ్యూటీ ఈ పాటలో గ్లామర్ ను ఫుల్లుగా ఒలకబోసింది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ అయిన ప్రభు ముందు నిలబడి తనదైన శైలిలో చెలరేగిపోయి మరీ డ్యాన్స్ చేసింది.  తన నడుము అందాలను.. నాభి సోకులను ప్రదర్శిస్తూ ఫుల్లుగా గ్లామరసం చిందించింది.  తమన్నా సోఫా మీద పడుకుని వేసే స్టెప్పును చూసి దెయ్యం పట్టిందేమోనని భయపడి ప్రభుదేవా ఒక దేవుడి ఫోటో కూడా తీసుకొస్తాడు. అలా భయపెట్టే రేంజ్ లో రెచ్చిపోయింది.

ఈ సినిమాలో కోవై సరళ.. ఆర్జే బాలాజీ.. నందిత శ్వేత ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.  ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం తెలుగులో డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఈ హారర్ కామెడీ సీక్వెల్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.