రవితేజ సినిమా కోసం చిరు స్టోరీ లైన్ తీసుకుంటున్నారా...?

Sun Jul 05 2020 18:00:53 GMT+0530 (IST)

Raviteja Follows Chiranjeevi

మాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి విజయవంతమైన సినిమాలకు స్టోరీ అందించిన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన స్టోరీ రవితేజకు నచ్చిందట. దీంతో త్రినాథరావు - ప్రసన్న కుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయడంతో పాటు మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన డిస్కషన్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి - హాస్యబ్రహ్మ జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన 'చంటబ్బాయి' సినిమా ఇన్సిపిరేషన్ గా ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసుకున్నారట. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ మరియు కామెడీ టైమింగ్ తో ఒకప్పటి రవితేజని గుర్తుచేయబోతోందట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.కాగా మాస్ మహారాజా ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ వరలక్ష్మీ శరత్ కుమార్ సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న 'క్రాక్' చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. రవితేజ - గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్ శీను' 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి 'క్రాక్' సినిమాతో హ్యాట్రిక్ సాదిస్తారేమో చూడాలి.