Begin typing your search above and press return to search.

వీకెండ్ ని 'బాయ్స్' తో కలిసి ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజా...!

By:  Tupaki Desk   |   9 Aug 2020 7:52 AM GMT
వీకెండ్ ని బాయ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజా...!
X
కరోనా స‌మ‌యంలో షూటింగ్స్ లేకపోవడంతో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ లో అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. మన మాస్ మహారాజా రవితేజ్‌ కూడా ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే సినిమాలు లేవని ఫిట్నెస్ ని అశ్రద్ధ చేయకుండా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. ఈ వయసులోనూ కండలు తిరిగిన దేహంతో రవితేజ యంగ్ హీరోకు పోటీ ఇచ్చేలా తయారయ్యాడు. ఇక ఈ లాక్ డౌన్ టైంలో ఎప్పుడూ లేని విధంగా రవితేజ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కాగా రవితేజ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక రవితేజ తన కొడుకుపై ఓ లుక్ వేస్తూ.. తన జిమ్ ఏరియాను అందరికీ చూపించడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో లేటెస్టుగా తన పెట్ డాగ్స్ తో దిగిన ఫోటో అభిమానులతో పంచుకున్నారు మాస్ మహారాజా. ''మై బాయ్స్'' అంటూ తన రెండు పెట్ డాగ్స్ ని ఆప్యాయంగా తల మీద నిమురుతున్న ఫోటో పోస్ట్ చేసారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోని చూడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ మరియు సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్ అయిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సినీ కష్టాలు అన్నీ అనుభవించి స్వయంకృషితో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. తర్వాత విల‌న్‌ గా సినిమాలు చేసిన ర‌వితేజ ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. మినిమమ్ గ్యారంటీ సినిమాలు అందిస్తూ నిర్మాతల హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ కెరీర్లో 66వ చిత్రంగా వస్తున్న 'క్రాక్'లో రవితేజ పవర్‌ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది.