మాస్ రాజాని మళ్లీ లైన్ లోకి తెస్తున్నారా రాజా!

Mon Sep 26 2022 15:15:02 GMT+0530 (India Standard Time)

Ravi Teja ready to do movie with Srinu Vaitla

మాస్ రాజా రవితేజని మళ్లీ శ్రీనువైట్ల లైన్ లోకి తెస్తున్నారా? ఈ ద్వయం ఈసారి కాన్పిడెంట్ గా బరిలోకి దిగుతుందా?  వెంకీ మార్క్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. ఇద్దరి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.నీకోసం.. వెంకీ దుబాయ్ శీను చిత్రాలతో సక్సెస్ పుల్ కాంబోగా మంచి పేరుంది.అయితే శ్రీనువైట్ల కెరీర్ ఒక్కసారిగా గాడి తప్పింది.  వరుస పరాజయాలు ఊపిరాడకుండా చేస్తోన్న తరుణంలో స్నేహితుడికి మాస్ రాజా పిలిచి మరీ అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఇచ్చారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది.

దీంతో శ్రీనువైట్ల గ్రాప్ పూర్తిగా పడిపోయింది. అతను సినిమా చేసి నాలుగేళ్లు అవుతుంది. కథలున్నా అవకాశాలిచ్చే హీరోలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రవితేజ...స్నేహితుడు కోసం సాహసానికి సిద్దమైనట్లు వినిపిస్తుంది. ఇద్దరు ప్లాప్ ల్లో ఉన్న నేపథ్యంలో  హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని కసిగా వర్కౌట్ చేస్తున్నారుట.

ఇటలీవలే శ్రీను వైట్లు రాజాకి కథ వినిపించారుట. వెంకీ తరహా ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ ఏడాది చివర్లోనే సినిమా ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది. అటు శ్రీనువైట్ల  మంచు విష్ణుతో సైతం సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'ఢీ' కి  సీక్వెల్ గా 'ఢీ ఢీ' టైటిల్ తో ఓ సినిమా  అనుకుంటున్నారుట.

ఇందులో హీరోయిన్లగా ప్రగ్యా జైశ్వాల్.. అను ఇమ్మాన్యూయేల్ గా లాక్ చేసినట్టు సమాచారం. మొత్తానికి మళ్లీ శ్రీను వైట్ల దర్శకుడిగా బిజీ అయ్యేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాప్ హీరోలందర్నీ పోగేసి వాళ్లకి హిట్టు ఇచ్చి టాలీవుడ్ లో తనంటే మరోసారి నిరూపించేందుకు గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నట్లు తెలుస్తుంది.

శ్రీనువైట్ల సక్సెస్ ఫార్ములా  వినోదం.  అతన్ని  అగ్ర దర్శకుల సరసన స్థానం కల్పించింది తనలో ఆ ప్రతిభనే. అయితే వరుసగా అవే జోనర్ సినిమాలు చేయడంతో ఆ తరహా ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు బోర్ కొట్టింది.  ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు బాగా తగ్గాయి. ఎంటర్ టైన్ మెంట్ చాలా సినిమాల్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో జనాల సైకాలజీని స్టడీ చేస్తూ మంచి వినోదాత్మకమైన సినిమాలు చేస్తే లైన్ లోకి రావొచ్చన్నది శ్రీనువైట్ల ప్లాన్ గా కనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.