రవితేజ ప్లాన్.. బిగ్గెస్ట్ హిట్ కు ఇదే బెస్ట్ ఛాన్స్!

Fri Sep 30 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Ravi Teja plan This is the best chance for the biggest hit

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న అతి కొద్ది మంది సీనియర్ హీరోలలో రవితేజ ఒకరు. ఇటీవల కాలంలో సరికొత్త కంటెంట్ ను ఎక్కువగా లైక్ చేస్తున్న ఆడియెన్స్ కు క్రాక్ అనే కమర్షియల్ సినిమాతో మెప్పించడం అనేది చాలా గొప్ప విషయమే. ఒక విధంగా ఆ టైం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది.అయితే ఆ తర్వాత మళ్లీ రవితేజ ఎప్పటిలనే రెగ్యులర్ సినిమాలతో డిజాస్టర్ అందుకుంటున్నాడు. ఖిలాడి సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా దెబ్బకొట్టేసింది. ఇక నెక్స్ట్ రాబోయే ధమాకా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఊహించడం కష్టమే. అలాగే ఆ తర్వాత రావణాసుర పై కూడా పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఇక ఉన్నదల్లా అందరి హోప్స్ ఎక్కువగా టైగర్ నాగేశ్వరరావు సినిమాపైనే ఉన్నాయి.

స్టువర్ట్ పురం మోస్ట్ పవర్ఫుల్ గజదొంగ అప్పట్లో పోలీసులు ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో రవితేజ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నాడు. దొంగాట - కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. అనే సినిమాతో దర్శకుడిగా గుర్తింపును అందుకున్న వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం రవితేజ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

స్టువర్ట్ పురం రాబిన్ హుడ్ గా జనాల్లో అప్పట్లో మంచి గుర్తింపు అందుకున్న టైగర్ నాగేశ్వరరావు కథ అనగానే జనాల్లో కొంత అట్రాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

సాధారణంగా రవితేజ ఏదైనా కథ ఓకే చేస్తే షూటింగ్ ఫినిష్ అయ్యే వరకు పెద్దగా పట్టించుకోడు. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రతి సన్నివేశం గురించి దర్శకుడుతో నిత్యం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు అనే ఆలోచనతోనే వెళుతున్నారట. మరి ఈ సినిమాతో రవితేజ అనుకున్నట్లుగా కెరీర్ బెస్ట్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.