మెగా-మాస్! అన్నయ్య కోసం అంత అడిగాడా?

Wed Dec 08 2021 12:04:40 GMT+0530 (IST)

Ravi Teja is going to take 7 crores for Megastar movie

మెగా కి మాస్ జోడిస్తే మెగా మాస్ అవుతుంది. ఊర మాస్ హీరో రవితేజ యాడైతే మాస్ ఫ్యాన్స్ కి పూనకాలే. ఇప్పుడు వాల్టేర్ వీరన్న (చిరు 154)కి అలాంటి అదనపు హంగుని బాబీ యాడ్ చేస్తున్నాడని సమాచారం. ఈ మూవీలో మెగాస్టార్ ఫుల్ మాస్ గా కనిపించనుండగా అతడితో రవితేజ అరాచకం సృష్టించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.మెగాస్టార్ చిరంజీవి వాల్టేర్ వీరన్న గా కనిపిస్తుండగా... ఇందులో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో చిరు సన్నిహితుడి పాత్రలో నటించేందుకు అతడిని దర్శకుడు బాబి సంప్రదించగా.. ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే ఓకే చెప్పాడట.

అయితే ఈ పాత్ర నిడివి ఎంత అన్నదానిపై క్లారిటీ లేదు కానీ రవితేజకు ముట్టజెబుతున్న పారితోషికం గుబులు పెంచేస్తోంది. అతడు ఒక్కో సినిమాకి 10కోట్లు ఫిక్స్ డ్ పారితోషికం అందుకుంటున్నాడన్న సమాచారం ఉన్నా కానీ.. ఇప్పుడు అన్నయ్య చిరంజీవి సినిమాలో పాత్రను చేయడానికి 7 కోట్లు తీసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడీ- రామారావ్ ఆన్ డ్యూటీ లాంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు రవితేజ. స్టూవర్డ్ పురం దొంగ కథాంశంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంతలోనే చిరుతో ఆఫర్ తనవైపు వచ్చింది.

మూవీ ఆద్యంతం చిరుతో సహాయకుడిగా ఉండే ఫ్రెండ్ పాత్రను బాబి రెడీ చేసారు. అది రవితేజకే సూటబుల్ అని ఒప్పించారట. ఈ సినిమా బాబి మార్క్ మాస్ ఎంటర్‌టైనర్. చిరును ముఠామేస్త్రి రేంజులో ఆవిష్కరించనున్నాడు బాబి. రవితేజ పాత్ర కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందట.

పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవితేజతో బాబీ మంచి సత్సంబంధాల్ని కలిగి ఉన్నాడు. ఈ సాన్నిహిత్యంతో రవితేజ ఈ పాత్రను చేయడానికి అంగీకరించాడు. ఇక మెగాస్టార్ ని అన్నయ్యగా భావించే రవితేజ తనకు అవకాశం రాగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశారట. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత మైత్రి మూవీస్ తో కలిసి రవితేజ మరోసారి పని చేస్తున్నాడు. ఆ సినిమా ఫ్లాపైనా ఇప్పుడు మైత్రి వాళ్లకు పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గలేదన్న టాక్ వినిపిస్తోంది.