Begin typing your search above and press return to search.

ఈ టైం లో అతనికి ఛాన్స్ ఇస్తున్న మాస్ రాజా..!

By:  Tupaki Desk   |   5 Dec 2022 1:30 PM GMT
ఈ టైం లో అతనికి ఛాన్స్ ఇస్తున్న మాస్ రాజా..!
X
మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ తర్వాత మరో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఖిలాడి, రామారావు సినిమాలు ఎలా వచ్చాయో అలానే వెళ్లాయి. ప్రస్తుతం ధమాకా మూవీ చేస్తున్న రవితేజ మరోపక్క టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేశాక రవితేజ మరోసారి సంపత్ నంది డైరెక్షన్ లో మూవీ చేసే ప్లాన్ లో ఉన్నాడట. టాలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో సంపత్ నంది ఒకరు మగధీర తర్వాత రాం చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది డైరెక్టర్ గా తన సత్తా చాటడంలో వెనకపడ్డాడు.

గోపీచంద్ తో సీటీమార్ మూవీ చేసిన సంపత్ నంది కొద్దిపాటి గ్యాప్ తో రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రవితేజ కు కథ వినిపించారట. త్వరలో సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.

రవితేజ సంపత్ నంది ఇదివరకు బెంగాల్ టైగర్ సినిమా చేశారు. ఆ మూవీ మాస్ రాజా ఖాతాలో హిట్ గా నిలిచింది. మరోసారి రవితేజ అతనికి ఛాన్స్ ఇస్తున్నాడు. రవితేజ నిర్ణయాన్ని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అసలే వరుస ఫ్లాపులు చేస్తున్న రవితేజ ఫాంలో లేని సంపత్ నందితో మూవీ ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సంపత్ నంది కూడా మొదట ఈ కథని గోపీచంద్ తో అనుకున్నా ఆల్రెడీ అతనితో గౌతమ్ నంద, సీటీమార్ రెండు సినిమాలు చేశాడు కాబట్టి రవితేజ అయితే బెటర్ అని భావించి మాస్ రాజాని ఒప్పించాడట. ఎలాగు సంపత్ నందికి మాస్ పల్స్ తెలుసు కాబట్టి రవితేజతో ఒక ఎనర్జిటిక్ మూవీ చేస్తాడని ఊహిస్తున్నారు. రవితేజ మాత్రం సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా వరుస ప్రాజెక్ట్ లతో తన దూకుడు చూపిస్తున్నాడు.

క్రాక్ లాంటి మరో హిట్ కథ కోసం చూస్తున్న రవితేజకి సంపత్ నంది అలాంటి కథనే తెచ్చాడని అంటున్నారు. రవితేజ, సంపత్ కాంబోలో మాస్ ఆడియన్స్ కి పండుగ లాంటి సినిమా ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరి కాంబో సినిమా నిర్మాత ఎవరు..? సంపత్ నంది సినిమా అంటే తమన్నా పక్కా ఉంటుంది. మరి ఈ మూవీలో కూడా సంపత్ నంది ఆమెని రిపీట్ చేస్తాడా..? ఇలాంటి విషయాలన్నిటికీ త్వరలో ఆన్సర్ దొరుకుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.