Begin typing your search above and press return to search.

F3: వెంకీ.. వరుణ్ తో మరో మాస్ స్టార్

By:  Tupaki Desk   |   22 Jan 2020 6:48 AM GMT
F3: వెంకీ.. వరుణ్ తో మరో మాస్ స్టార్
X
పోయినేడాది సంక్రాంతి కి విడుదలై సంక్రాంతి మొగుడుగా.. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన చిత్రం 'F2'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్.. వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన 'F2' ప్రేక్షకులకు కితకితలు పెట్టింది. ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నామని.. దిల్ రాజు నిర్మిస్తారని 'F2' ప్రమోషన్స్ సమయంలోనే వెల్లడించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

దర్శకుడు అనిల్ రావిపూడి 'F2' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'సరిలేరు నీకెవ్వరు' తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి విడుదలైన సరిలేరు భారీ కలెక్షన్స్ వసూలు చేసి మాస్ సినిమాలు తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి పట్టు ఎలాంటిదో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా తర్వాత అనిల్ 'F3' స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు వెంకీ.. వరుణ్ లు ఆసక్తిగా ఉన్నారని.. ఈ ఇద్దరి తో పాటు మాస్ మహారాజా రవితేజను కూడా ఈ సినిమాలో నటించేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు

సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ వెంకీ-వరుణ్-రవితేజ కాంబినేషన్ మాత్రం క్రేజీగా ఉంది. ముగ్గురు కలిస్తే వచ్చే ఆ ఫన్ ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పడం లో ఏమీ సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.