Begin typing your search above and press return to search.

పిక్ టాక్: మజిలీ బ్యూటీతో రామారావు ఆన్ డ్యూటీ..!

By:  Tupaki Desk   |   15 Oct 2021 1:38 PM GMT
పిక్ టాక్: మజిలీ బ్యూటీతో రామారావు ఆన్ డ్యూటీ..!
X
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో ''రామారావు ఆన్ డ్యూటీ'' ఒకటి. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు రజిషా విజయన్ - దివ్యాన్ష కౌశిక్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన మాస్ ని ఆకట్టుకునే టైటిల్ పోస్టర్ - ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

దసరా పండుగను పురస్కరించుకుని 'రామారావు ఆన్ డ్యూటీ' టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరోయిన్ దివ్యాంశ కౌషిక్ తో రవితేజ రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారని అర్థం అవుతోంది. ఫెస్టివల్ స్పెషల్ గా వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

'రామారావు ఆన్ డ్యూటీ' వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఒక స్పెషల్ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తారు. వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - సురేఖ వాణి - మధు సూధన్ రావు - చైతన్య కృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్‌ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి దీనికి నిర్మాత.

శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్న మాస్ మహారాజాకు 'రామారావు ఆన్ డ్యూటీ' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.