మాస్ రాజా 'కనకదుర్గ' ముచ్చట

Thu Mar 21 2019 19:25:38 GMT+0530 (IST)

Ravi Teja Next Movie Title Kanakadurga

రవితేజ వరుస ఫ్లాప్ ల తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని ఇటీవలే విఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే మరో సినిమాను కూడా సమాంతరంగా చేసేందుకు సిద్దం అయ్యాడు. చాలా కాలంగా చర్చలో ఉన్న 'తేరి' రీమేక్ కు ఇప్పుడు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందబోతుంది.తేరి రీమేక్ కు 'కనకదుర్గ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళ 'తేరి'కి తెలుగు నేటివిటీ టచ్ ఇచ్చి పూర్తిగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ చిత్రంను పవన్ కళ్యాణ్ తో చేసేందుకు సంతోష్ శ్రీనివాస్ ప్రయత్నాలు చేశాడు. ఆయన ఓకే చెప్పినా కూడా రాజకీయాల్లో క్రియాశీలకం అవ్వడం కారణంగా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు.

ఎక్కువ శాతం పవన్ నో చెప్పిన సినిమాలు రవితేజ చేసి సక్సెస్ అయ్యాడు. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రవితేజ 'కనకదుర్గ' చిత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. డిస్కో రాజా చిత్రంతో పాటు కనకదుర్గ చిత్రం కూడా ఇదే ఏడాది విడుదల అయ్యేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.