Begin typing your search above and press return to search.

రవితేజ మార్క్‌ మళ్లీ కనిపిస్తుంది

By:  Tupaki Desk   |   15 Oct 2021 3:30 AM GMT
రవితేజ మార్క్‌ మళ్లీ కనిపిస్తుంది
X
మాస్ మహారాజా రవితేజ క్రాక్‌ సక్సెస్‌ తో జోరు మీదున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ సినిమాను ముగించేసిన రవితేజ మరో వైపు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న రామారావు సినిమాకు సంబంధించిన షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టక ముందే రవితేజ మరో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న త్రినాథరావు నక్కని దర్శకత్వంలో సినిమా. గత ఏడాదిలోనే సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు.

త్రినాథరావు నక్కిన ఒక మంచి మాస్ మసాలా కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఖిలాడీ మరియు రామారావు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ రెండు సినిమాలతో పాటు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ.. త్రినాథరావు నక్కిన ల కాంబో మూవీకి 'ధమాకా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడట.

రవితేజ ఒకానొక సమయంలో హీరోగా సినిమాలు చేయడం మానేస్తే బెటర్‌ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన కూడా సినిమాలకు గుడ్‌ బై చెప్పడేమో బెటర్ కావచ్చు అనుకున్నాడు. కాని అనూహ్యంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోవడంతో హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. రవితేజ అయిదు ఆరు సంవత్సరాల ముందు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకుని వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేవాడు. కాని ఆ తర్వాత కాలంలో ప్లాప్ లు పడటం వల్ల చాలా సినిమాలు తగ్గించాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రవితేజ ధమాకా అన్నట్లుగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.