Begin typing your search above and press return to search.

'ఖిలాడి' షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   24 July 2021 9:30 AM GMT
ఖిలాడి షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఖిలాడి''. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. అయితే ఇటీవల రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాని సెట్స్ పైకి తీసుకురావడంతో 'ఖిలాడి' షూటింగ్ పై పలు రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ షూటింగ్ అప్డేట్ ఇచ్చింది.

'ఖిలాడి' సినిమా షూటింగ్ జూలై 26 నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్.. రవితేజకు సంబంధించిన స్టైలిష్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ సాంగ్ కూడా చిత్రీకరిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా, 'ఖిలాడి' చిత్రంలో ర‌వితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాక్షన్ హీరో అర్జున్ - అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఓకేసారి తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పెన్ స్టూడియోస్‌ జయంతీలాల్‌ గడ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.