Begin typing your search above and press return to search.

హైప్ కోసమే హీరోయిన్ పై డిపెండ‌య్యాడా?

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:57 AM GMT
హైప్ కోసమే హీరోయిన్ పై డిపెండ‌య్యాడా?
X
వెట‌ర‌న్ హీరోల‌కు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదు. అందులో హీరోయిన్ స‌మ‌స్య కీల‌క‌మైన‌ది. కుర్ర నాయిక‌లు నిర్మొహ‌మాటంగా సీనియ‌ర్ల‌తో చేయ‌మ‌ని చెప్పేస్తున్నారు. కాల్షీట్ల స‌మ‌స్య అనో ఇంకోటో చెప్పి త‌ప్పించేసుకుంటున్నారు. అయితే అలాంట‌ప్పుడు భారీ పారితోషికాల్ని ఎర‌వేసి ఒప్పించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నానా తంటాలు ప‌డాల్సి వ‌స్తోంది. ఈ జాబితాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా చేరారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది.

ఇన్నాళ్లు ర‌వితేజ సినిమా అంటే క్రేజీ గాళ్స్ ఎగిరి గంతేసి మ‌రీ ఒప్పేసుకునే ప‌రిస్థితి ఉండేది. కానీ రాజా ఇటీవ‌ల హిట్టు ట్రాక్ త‌ప్ప‌డంతో భామ‌లు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే క‌థానాయిక‌ల్ని ఒప్పించాలంటే పారితోషికంలో హైప్ తో ఎర వేయాల్సి వ‌స్తోంది. ఇక ఇదొక కోణం అనుకుంటే ర‌వితేజ‌కు మార్కెట్లో క్రేజు త‌గ్గ‌డంతో గ్లామ‌ర‌స్ బ్యూటీల్ని క్రేజు ఉన్న భామ‌ల్ని బ‌రిలో దించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నానా ప్ర‌యాస‌లు ప‌డుతున్నారట‌.

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న తాజా చిత్రానికి క‌థానాయిక విష‌యంలో బోలెడంత సందిగ్ధ‌త నెల‌కొంద‌ట‌. ప్రాజెక్ట్ హైప్ పెంచాలంటే కియరా రేంజు హీరోయిన్ అవ‌స‌రం అని భావించిన ర‌మేష్ వ‌ర్మ బృందం త‌న‌ని సంప్ర‌దించార‌ని అయితే.. ఇదే అద‌నుగా కియ‌రా కొండెక్కి కూచుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. కియరా ప్రస్తుతం బాలీవుడ్ లో ఊపిరిస‌ల‌ప‌నంత బిజీగా ఉంది. వ‌రుస‌గా నాలుగైదు సినిమాల్లో న‌టిస్తూ కాల్షీట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. అందుకే 2కోట్ల పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. కియ‌రా బాలీవుడ్ లో ఎంత తోపు అయినా టాలీవుడ్ లో రెండు సినిమాల కిడ్ మాత్ర‌మే. కానీ ఇంత డిమాండ్ చేసిందంటే సంద‌ర్భం అలాంటిది అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ భామ పేరు త‌దుప‌రి మ‌హేష్ న‌టిస్తున్న 27వ చిత్రానికి ప‌రిశీల‌న‌లో ఉంది. ఆ క్ర‌మంలోనే ఈ రేంజులో డిమాండ్ చేస్తోంద‌ట‌. మ‌హేష్ సంగ‌తి స‌రే కానీ.. ఇంత‌కీ ర‌వితేజ‌కు కియ‌రా ప్ల‌స్ అవుతుందా? మైన‌స్ అవుతుందా?