బోల్డ్ మ్యాడమ్ అన్ స్టాపబుల్ గేమ్ ఛేంజర్

Wed Sep 30 2020 23:00:01 GMT+0530 (IST)

Bold Madame Unstoppable Game Changer

చూసే చూపు.. మాట తీరు.. నడక నడత వగైరా వగైరా ప్రతిదీ బోల్డ్ ఎటెంప్టే. ఆ స్పెషల్ క్వాలిటీతోనే అప్పట్లో నటించింది ఒకట్రెండు సినిమాలే అయినా టాలీవుడ్ ఆడియెన్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది రవీనా టాండన్. బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా వెలిగిపోయిన రవీనా హిందీ చిత్రసీమ అగ్ర కథానాయకుల సరసన నటించింది.ఇక ఇటీవల రవీనా సోషల్ మీడియా వేదికలపై బోల్డ్ ఫోటోషూట్లతో చెలరేగుతోంది. తాజాగా రవీనా షేర్ చేసిన ఫ్యాబ్ లుక్ ఫోటోషూట్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. బోల్డ్ మ్యాడమ్ అన్ స్టాపబుల్ గేమ్ ఛేంజర్ అనే కథనాన్ని ఈ మ్యాగజైన్ ప్రచురించింది. ఇంతకుముందు అత్యాచారం హత్య నేపథ్యంలో బోల్డ్ మూవీలో నటించిన రవీనాకు మంచి పేరొచ్చింది. ఇక మీటూ వేదికగానూ రవీనా గళం విప్పుతుంటే తనలోని బోల్డ్ యాటిట్యూడ్ కి మైమరిచిపోయే మగువలు ఉన్నారు.

2018 లో తనూశ్రీ దత్తా-నానా పటేకర్ వేధింపుల వివాదంలో రవీనా టాండన్ వరుస ట్వీట్లతో తనూశ్రీకి మద్ధతు పలికారు. నటులు అయిన భర్తలు నటీమణుల వృత్తిని నాశనం చేసినప్పుడు నిశ్శబ్ద పరిశీలకులు లేదా ప్రేరేపకులు గొంతెత్తుతారని రవీనా అన్నారు. సరసాలు ముగిసిన తర్వాత నటీమణుల వృత్తిని నాశనం చేసినప్పుడు .. రక్షణ ఉండాలి కదా? మహిళా సాధికారత పై ఎన్ని సినిమాలు తీస్తారో చూడాలి! అంటూ సెటైర్లు వేశారు రవీనా. ఇది స్పష్టంగా తనుశ్రీ జీవితంలో జీవితాన్ని మార్చే సంఘటన అని రవీనా ట్వీట్ చేశారు.

నానా పటేకర్ తో కలిసి పనిచేసిన సమయాన్ని కూడా రవీనా గుర్తుచేసుకున్నారు. అతని `హింసాత్మక నిగ్రహం` గురించి తాను విన్నానని పేర్కొన్నారు. అయితే తాను దానిని ఎప్పుడూ చూడలేదని అతన్ని `మర్యాదస్తుడు.. సహాయకారి` అని భావించానని ఆమె పేర్కొంది. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని రవీనా అన్నారు.