Begin typing your search above and press return to search.

#DRUGS కూకటివేళ్లు సహా పెక‌లించాలి!- ర‌వీనా టాండ‌న్

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:33 PM GMT
#DRUGS కూకటివేళ్లు సహా పెక‌లించాలి!- ర‌వీనా టాండ‌న్
X
బాలీవుడ్ ‌లో మాదకద్రవ్యాల లింక్ (నెక్సస్) లో ఉన్న జాబితాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చురుకుగా పరిశోధిస్తున్న తరుణంలో రవీనా టాండన్ తాజా సోషల్ మీడియా పోస్టులు సంచ‌ల‌నంగా మారాయి. డ్ర‌గ్స్ లో `క్లీన్ అప్`ను ర‌వీనా స్వాగతించారు.

డ్రగ్స్ కేసుపై రవీనా టండన్ ట్వీట్ చేస్తూ.. ``కూకటివేళ్లు సహా.. మొత్తం క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది.. ఇది స్వాగతించాల్సిన విషయం.. మన భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.. ఇక్కడి నుంచే మొదలుపెట్టండి.. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకలించేయండి.. డ్రగ్స్ వాడినవారిని.. అమ్మిన వారిని.. డీలర్స్ ని అందరినీ శిక్షించండి.. దీనివల్ల లాభపడ్డ పెద్ద వారిని కూడా వదలకండి`` అని చెప్పుకొచ్చింది.

ర‌వీనా టాండ‌న్ అటు బాలీవుడ్ స‌హా ఇటు సౌత్ ఇండ‌స్ట్రీస్ లోనూ పాపుల‌ర్. నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న ర‌వీనా `బంగారు బుల్లోడు` చిత్రంలో న‌టించారు. ఆ సినిమాలో ర‌వీనా గ్లామ‌ర్ ట్రీట్ ని యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. చాలా గ్యాప్ త‌ర్వాత‌ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `బుడ్డా హోగా తేరా బాప్` అనే చిత్రంలోనూ ర‌వీనా న‌టించారు.