Begin typing your search above and press return to search.

మెగాస్టార్ క్లాప్‌ తో 'రావ‌ణాసుర‌' షురూ

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:30 AM GMT
మెగాస్టార్ క్లాప్‌ తో రావ‌ణాసుర‌ షురూ
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్ తో వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని లైన్ లో పెట్టేశారు. ఇప్ప‌టికే ఆయ‌న చేతితో ఆర‌డ‌జ‌నుకు పైగా సినిమాలున్నాయి. అందులో ర‌మేస్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న `ఖిలాడీ` రిలీజ్ కి సిద్ధం అవుతుండ‌గా మ‌రో మూవీ `రామారావు ఆన్ డ్యూటి` చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో రెండు మూడు చిత్రాలు సెట్స్ పైకి రానున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రావ‌ణాసుర‌`. `హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్ ` అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ మూవీకి సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్‌, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ పై ఈ మూవీని అభిషేక్ నామా తో క‌లిసి శ్రీ‌కాంత్ విస్సా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మాస్ మ‌మారాజా ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నారు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ ఈ మూవీ వుండ‌బోతోంది. ఇందులో మాస్ రాజాకు జోడీగా ఫ‌రియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్‌, మేఘా ఆకాష్ న‌టిస్తున్నారు....

గ‌రువారం భోగి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న‌ ఈ మూవీని హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్ లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముందు `రావ‌ణాసుర‌` ర‌వితేజ లుక్ పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించారు.త‌రువాత‌ పూజా కార్య‌కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో, హీరోయిన్ ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. స్క్రిప్ట్ ని ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, బాబి, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌కు అందించారు.

మెగాస్టార్ రివీల్ చేసిన మాస్ మ‌హా రాజా `రావ‌ణాసుర‌` లుక్ పోస్ట‌ర్ స‌రికొత్త‌గా వుంది. ర‌వితేజ కౌబాయ్ త‌ర‌మాలో భారీ సిగ‌ర్ ని వెలిగిస్తూ ర‌గ్గ్‌డ్ లుక్ లో క‌నిపిస్తున్న తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స్టిల్ చూస్తుంటే సినిమాలో మాస్ రాజా ఓ రేంజ్ తో త‌న విశ్వ‌రూపం చూపించ‌బోతున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో `జాంబిరెడ్డి` ఫేమ్‌ ద‌క్షా నాగ‌ర్‌క‌ర్ లేడీ విల‌న్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇప్ప‌టికే ఆమె పాత్ర‌ని మేక‌ర్స్ కన్ఫ‌మ్ చేయ‌డ‌మే కాకుండా అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. ఇక ఈ చిత్రానికి సంబంధించిన‌ మ‌రో విశేషం ఏంటంటే యంగ్ హీరో సుశాంత్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న మేకోవ‌ర్ కూడా చాలా కొత్త‌గా వుండ‌బోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ తో పాటు మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.