Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్ లో 'రావ‌ణాసూర'..సెకెండ్ షెడ్యూల్ పూర్తి

By:  Tupaki Desk   |   12 Feb 2022 6:50 AM GMT
జెట్ స్పీడ్ లో రావ‌ణాసూర..సెకెండ్ షెడ్యూల్ పూర్తి
X
మాస్ రాజా ర‌వితేజ సినిమాల స్పీడ్ గురించి చెప్పాల్సి ప‌నిలేదు. ఒక‌టి సెట్స్ లో ఉండ‌గానే...రెండు..మూడు సినిమాల్ని లైన్ లోకి తెచ్చేస్తున్నారు. సెట్స్ లో ఉన్న సినిమా అప్ డేట్ చెక్ చేసుకుని త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌కు డేట్లు కేటాయిస్తున్నారు. ఫేమ్ ఉన్న‌త కాల‌మే వీలైనంత దున్నేయాలి ! అన్న టార్గెట్ గా రాజా సినిమాలు చేస్తున్న వైఖ‌రి క‌నిపిస్తోంది.

ఇటీవ‌లే త‌న 69వ చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రీక‌ర‌ణ పూర్తిచేసారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇదే వేవ్ లో 70వ చిత్రం `రావ‌ణాసుర‌`ని కూడా సెట్స్ కి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. స‌క్రాంతి కానుక‌గా చిత్రాన్ని ప్రారంభించిన యూనిట్ ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ ని పూర్తిచేసింది.

తాజాగా రెండ‌వ షెడ్యూల్ కూడా పూర్త‌యింది. సెకెండ్ షెడ్యూల్ పూర్త‌యింద‌ని రివీల్ చేస్తూ ఈ సంద‌ర్భంగా యూనిట్ స‌భ్యులంతా ఒకే ఫ్రేమ్ లో కెమెరాకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోలో ర‌వితేజ..సుశాంత్.. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌...నిర్మాత అభిషేక్ నామ త‌దిత‌రులు ఉన్నారు. ఈ షెడ్యూల్ లో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

రెండు షెడ్యూళ్ల‌ను హైద‌రాబాద్ లోనే చేసారు. ఈనేప‌థ్యంలో త‌దుప‌రి షెడ్యూల్స్ విదేశాల్లో ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో టీమ్ ముందుగా విదేశీ షెడ్యూల్ పూర్తిచేయాల‌ని వీలైనంత వేగంగా మొద‌టి రెండు షెడ్యూళ్ల‌ను పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక సినిమాకి సంబంధించి అన్ని ప‌నులు పూర్తిచేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ లోపు క‌రోనా కొత్త వేరియెంట్లు రాకుండా ఉంటే అనుకున్న ప్ర‌కారం అన్ని జ‌రుగుతాయి. ఇందులో సుశాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆ పాత్ర డిఫ‌రెంట్ లుక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్- ఆర్ టీ టీమ్ వ‌ర్స్డ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో అందాల భామ‌లు అను ఇమ్మాన్యూయేల్..మేఘా ఆకాష్‌..ఫ‌రియా అబ్దుల్లా..ద‌క్షా న‌గార్క‌ర్..పూజిత పొన్నాడ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేస్తున్నారు. భీమ్స్ సిసి రోలియో..హ‌ర్ష వ‌ర్ధ‌న్..రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.