లిప్ లాక్ తో రష్మకని ఇబ్బంది పెట్టిన వెళ!

Tue Oct 04 2022 11:40:52 GMT+0530 (India Standard Time)

Rashmika was troubled with lip lock!

నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ప్రమోట్ అయింది. ప్రస్తుతం రెండు భాషల్ని కలిపి దున్నేస్తుంది. వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా డేట్లు అడ్జస్ట్ చేస్తుంది.  అయితే ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోంది. అవి వృత్తిపరంగా కాకపోయినా..వ్యక్తిగత విషయాలతో రష్మిక మనసుకు భారీ గాయాలే తగిలాయి అన్నది వాస్తవం.కన్నడలో సక్సెస్ అయిన బ్యూటీ అక్కడి స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడి నిశ్చితార్ధం వరకూ వెళ్లింది. అదే సమయంలో తెలుగులో అవకాశాలు రావడం..'గీతగోవిందం'..'డియర్ కామ్రేడ్' లాంటి చిత్రాల్లో  హీరోతో పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించడం తీవ్ర విమర్శలే తెచ్చిపెట్టాయి. ఈ విషయంలో కన్నడ మీడియా సహా ఇండస్ర్టీ అమ్మడిపై పగబట్టినట్లుగానే వ్యవరించినట్లు అప్పటి సన్నివేశాలు కనిపించాయి.

నిశ్చితార్ధం రద్దు అవ్వడం వెనుక అసలు కారకురాలు రష్మిక అని....కెరీర్ కోసమే రక్షిత్ కి బ్రేకప్ చెప్పిందని కథనాలు వెడెక్కించాయి. మరోవైపు సోషల మీడియాలోనూ రష్మికని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించారు. అయితే వీటిపై ఏనాడు రష్మిక స్పందించలేదు. అన్నింటిని మౌనంగా భరిస్తూనే వచ్చింది. అనే వాళ్లు అనుకుంటూనే ఉంటారని వాళ్ల విజ్ఞతకే వదిలేసింది.

అయితే రక్షిత్  తో బ్రేకప్ మ్యాటర్  కంటే సినిమాల్లో లిప్ లాక్ సీన్లపై జరిగిన ట్రోలింగ్ కి ఎక్కువగా బాధపడినట్లు తాజాగా రివీల్ చేసింది. ఒకానొక సమయంలో ఆ ట్రోలింగ్ తట్టుకోలేక డిప్రెషన్  లోకి వెళ్లిపో యినట్లు చెప్పుకొచ్చింది. రాత్రులు మంచం మీద కన్నీరు.మున్నీరు అయ్యేదంట. నతలో తరుచూ నెగిటివ్ ఆలోచనలు వచ్చేవని...వాటి నుంచి ఎంత బయటపడాలని ప్రయత్నించినా కష్టతరంగా మారేదని చెప్పుకొచ్చింది.

మొత్తానికి రష్మిక నెగిటివ్ కామెంట్లను అంత సులభం తీసుకునే మనస్తత్వం గల అమ్మాయి కాదని తెలుస్తోంది. చాలా మంది హీరోయిన్లు కామెంట్లు..ట్రోలింగ్ లను పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ మనసులు పట్టించుకున్నా..బయటకు ఓపెన్ కారు.  రష్మిక కూడా ఇన్నాళ్లు అలాగే మెయింటెన్ చేసుకుంటూ వచ్చింది. కానీ అనుకోకుండా ఇలా ఒక్క సారిగా బరస్ట్ అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.