పెట్ డాగ్ కోసం ఫ్లైట్ టికెట్.. రూమర్స్ పై రష్మిక స్పందన..!

Sat Jun 25 2022 16:00:00 GMT+0530 (IST)

Rashmika response on rumors

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరని చెప్పాలి. నేషనల్ క్రష్ ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. అయితే రష్మిక తన సినిమా షూటింగ్స్ లో భాగంగా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని ల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.రష్మిక సినిమాల షూటింగ్స్ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించాల్సి ఉండగా.. తనతో పాటు తన పెట్ డాగ్ కు కూడా ప్లైట్ టికెట్స్ బుక్ చేయాలని నిర్మాతలను డిమాండ్ చేస్తోందని ఓ వెబ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది నెట్టింట చక్కర్లు కొట్టి చివరకు రష్మిక వద్దకు చేరింది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో దీనిపై స్పందిస్తూ తనపై వచ్చిన రూమర్స్ ను కొట్టిపారేసింది రష్మిక. తన పెంపుడు జంతువును ముంబైకి లేదా తాను ప్రయాణించే ఇతర ప్రాంతానికి తీసుకెళ్లాలని కోరుకున్నా.. తనతో కలిసి రాదని పేర్కొంది. ఈ పుకార్లు చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నానని కౌంటర్ ఇచ్చింది.

ఈ మేరకు రష్మిక ట్వీట్ చేస్తూ.. ''హే.. కమాన్. ఇలాంటివి ఎలా సృష్టిస్తారలో అర్థం కాదు. ఆరా(రష్మిక పెట్ డాగ్) నాతో కలిసి ప్రయాణించాలని మీరు కోరుకున్నా.. తనకు మాత్రం నాతో ట్రావెల్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్ లోనే హ్యాపీ ఉంటుంది. మీ చొరవకు ధన్యవాదాలు'' అని పేర్కొంది. దీనికి నవ్వుతున్న ఎమోజీలను యాడ్ చేసింది.

ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ''క్షమించండి.. నవ్వు ఆపుకోలేకపోతున్నాను'' అని కామెంట్ చేసింది రష్మిక మందన్నా. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇది మాత్రమే కాదు మేడం.. మీ మీద ఇలాంటివి చాలా వస్తున్నాయి' అని కామెంట్ పెట్టాడు. రష్మిక ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ''ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్'' అని చెప్పింది. ప్రస్తుతం లక్కీ బ్యూటీ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే రష్మిక మందన్నా తన పెంపుడు జంతువుతో కలిసి ముంబై వీధుల్లో తిరగడం చూశామని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాత డబ్బుతో కాకుండా తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఉండొచ్చు కదా? అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. డాగ్స్ ను విపరీతంగా ప్రేమించే రష్మిక.. ముంబైలో మరో పెంపుడు జంతువును తీసుకుందేమో అని ఎదురుదాడి చేస్తున్నారు.

నిజానికి రష్మిక మందన్నా కు మూగ జీవాలు అంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో డజనుకు పైగా డాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ట్రోల్స్ వస్తున్న టైంలో డాగ్ మాదిరిగా ఫోటోలు దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఏదైతేనేం ఇప్పుడు ఆ రూమర్స్ వల్ల రష్మిక పెట్ డాగ్ ఆరా కూడా వార్తల్లో నిలిచింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పోతుంది. 'పుష్ప' తో నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం హిందీలో 'మిషన్ మజ్ను' - 'గుడ్ డే' మరియు 'యానిమల్' వంటి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.

అలానే విజయ్ తో కలిసి 'వారసుడు' అనే బైలింగ్విల్ మూవీ.. దుల్కర్ సల్మాన్ నటించే 'సీతా రామం' అనే త్రిభాషా చిత్రంలో రష్మిక నటిస్తోంది. త్వరలోనే అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రూల్' వంటి పాన్ ఇండియా మూవీ చేయనుంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.