Begin typing your search above and press return to search.

ఐదేళ్లకే మ్యాగజైన్ పై మెరిసిన స్టార్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   4 Jun 2020 12:32 PM GMT
ఐదేళ్లకే మ్యాగజైన్ పై మెరిసిన స్టార్ హీరోయిన్!
X
ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన. మొదటి సినిమాతోనే టాలీవుడ్ యూత్ అందరిని ఫిదా చేసింది. రష్మిక చిలిపితనం, క్యూట్ క్యూట్ నటన కుర్రకారుకి విపరీతంగా నచ్చేసింది. ఆ క్యూట్ నెస్ తోనే.. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, భీష్మా లాంటి వరుస విజయాలు దక్కడంతో టాలీవుడ్ లో అమ్మడికి భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలతో భారీ విజయాలను అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రష్మిక విజయ పరంపర కొనసాగుతున్నట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుతున్న రష్మిక క్రేజ్ మాములుగా లేదు.

అయితే రష్మిక సినిమాలే కాకుండా బ్యూటీ మ్యాగజైన్స్ లో కూడా దర్శనమిస్తుంది. ఎల్లపుడు సోషల్ మీడియాలో అలెర్ట్ గా ఉండే రష్మిక ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోయిన్లు వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ రష్మిక తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్నపుడే గోకులం అనే మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ బ్యూటీ సెలబ్రిటీగా మారింది. ఆ మ్యాగజైన్ కోసం 2001లో దిగిన ఫోటో అని చెబుతూ.. అప్పటి నుంచి మా అమ్మ ఈ మ్యాగజైన్ ని దాచుకుందని.. ఇప్పటికీ నేను కనిపించే మ్యాగజైన్స్ అన్నీ దాచుకుంటూనే ఉంటుందని చెప్తుంది రష్మిక. అలా ఐదేళ్ల వయసులోనే మా రష్మిక సెలబ్రిటీ అయిందని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.