Begin typing your search above and press return to search.

'పుష్ప'లో స్టార్ హీరోయిన్ భారీ ట్విస్ట్..??

By:  Tupaki Desk   |   18 April 2021 2:30 AM GMT
పుష్పలో స్టార్ హీరోయిన్ భారీ ట్విస్ట్..??
X
స్టైలిష్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో 20వ సినిమా పుష్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా కాబట్టి పుష్పతో హ్యాట్రిక్ కొడతారని అభిమానులు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాస మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోబన్నీ సరసన లేటెస్ట్ ట్రెండీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అంచనాలు పెంచేసిన బన్నీ, సుక్కు కాంబినేషన్ అభిమానులకు ఊరటనిచ్చేందుకు ఇటీవలే పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో అసలు హీరోయిన్ రష్మిక క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తం అవుతుండగా.. పలు ఊహగానాలు చర్చలకు దారితీసాయి. కానీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమాలో రష్మిక చిత్తూరు జిల్లా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. పక్కా డి-గ్లామర్ పాత్రలో రష్మిక అలరించనుంది. అలాగే ఈ సినిమాలో రష్మిక పాత్ర ఓ స్ట్రాంగ్ ట్విస్టు కూడా ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తుంది. మరి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతుంది అమ్మడు. ఇదిలా ఉండగా.. రష్మిక ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఓవైపు పుష్ప చేస్తూనే మరోవైపు బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తోంది. మిషన్ మజ్ను అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక డెబ్యూ చేయనుంది. ఇక పుష్ప సినిమా మాస్ మూవీకాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.