Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మకి ముందుచూపు ఎక్కువే!

By:  Tupaki Desk   |   24 Sep 2021 6:30 AM GMT
ముద్దుగుమ్మకి ముందుచూపు ఎక్కువే!
X
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ రేసులో రష్మిక రెండవ స్థానంలో కొనసాగుతోంది. నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న పూజ హెగ్డేకి ఆమె చాలా దగరికి వచ్చేసింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు వరుస విజయాలను అందుకోవడంతో, ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ జోడీగా 'పుష్ప' సినిమా చేస్తోంది. ఫస్టు పార్టు ముగింపు దశకి చేరుకోవడంతో, శర్వానంద్ సరసన నాయికగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఇలా తెలుగులో దూసుకుపోతున్న రష్మిక, తమిళ .. హిందీ భాషల్లో కుదురుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది.

బాలీవుడ్లో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన రష్మిక, మరో రెండు సినిమాలకి సైన్ చేయనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. చూస్తుంటే ఆమె బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పాన్ ఇండియా సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందువల్లనే ఆమె ముంబై పీఆర్ ఏజెన్సీలో జాయినైందని అంటున్నారు. బాలీవుడ్ సినిమాల సంఖ్యను పెంచుకునే ఆలోచనలో ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

ఇప్పుడు ఏ హీరో .. హీరోయిన్ చూసినా ఒక భాషకి మాత్రమే పరిమితం కావడానికి ఇష్టపడటం లేదు. తమ అవకాశాలు .. మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వివిధ భాషల్లోని ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులకు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు దక్కుతాయి. అలా తెలియాలంటే తాము చేసిన సినిమాలు అక్కడ రిలీజ్ కావాలి .. ఆ భాషల్లోని స్క్రీన్స్ పై తాము తరచూ కనిపిస్తూ ఉండాలి. అలా ఆర్టిస్టులను ఆయా ప్రాంతాల్లోని ప్రేక్షకులకు ఏదో ఒక రకంగా టచ్ లో ఉండేలా పీఆర్ ఏజెన్సీ చూసుకుంటుంది.

తమ ఏజెన్సీలో జాయిన్ అయినవారికి సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని అందరి దృష్టిలో పడేలా పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తూ ఉంటాయి. అలా చేయడం వలన ఆర్టిస్టులు ఆయా భాషలకి చెందిన ప్రేక్షకులకు చేరువైపోతారు. ముంబైలోని పీఆర్ ఏజెన్సీ ద్వారా ఇప్పటికే ప్రభాస్ .. చరణ్ .. అల్లు అర్జున్ తమ దూకుడు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెరియర్ పరంగా తాను మరింత ముందుకు వెళ్లాలనే ఆలోచనతో రష్మిక కూడా జాయిన్ అయింది. తెరపైన .. సోషల్ మీడియాలోనే కాదు, కెరియర్ కి సంబంధించిన ప్లానింగ్ లోను రష్మిక చాలా యాక్టివ్ గానే ఉందన్న మాట.