కామ్రేడ్ కోసమేనా శ్రీవల్లి ఈ ప్రయాణం

Wed Nov 24 2021 22:00:01 GMT+0530 (IST)

Rashmika foreign travel has become a hot topic on social media

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు తో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈమె సినిమాలు చేసింది. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ యూఎస్ లో లైగర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. లైగర్ చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో పుష్ప శ్రీవల్లి విదేశీ ప్రయాణం పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.సోషల్ మీడియాలో రష్మిక విదేశీ ప్రయాణం గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అందరు కూడా ఈ అమ్మడు విదేశాలకు వెళ్లేది ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. నేను ఎక్కడకు వెళ్తున్నానో చెప్పుకోండి అంటూ ఆమె సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంతో చాలా మంది విజయ్ దేవరకొండ వద్దకు వెళ్తున్నారు అంటూ కొందరు కామెంట్స్. ఇంత బిజీగా ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లడం అంటే ఖచ్చితంగా హాలీడే కే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీవల్లి పుష్ప ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉండగా ఎందుకు యూఎస్ కు వెళ్లడం ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హిందీలో ఈ అమ్మడు రెండు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు వచ్చే ఏడాది ఆ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళంలో కూడా ఈమె హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. శ్రీవల్లి పాత్ర కోసం రష్మిక మందన్నా పడ్డ కష్టం గురించి చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండను ఈమె కలువనుందా లేదంటే మరేదైనా పనిమీద ఆమె వెళ్తుందా అనేది చూడాలి.