నువ్వా.. నేనా.. నంబర్ వన్..ఫీక్స్ లో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల క్రేజ్

Wed Nov 25 2020 09:30:16 GMT+0530 (IST)

Rashmika Vs Pooja Hegde In Tollywood

పూజా హెగ్డే.. రష్మికా మందన్నా.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. నంబర్ 1 స్థానం కోసం ఈ ముద్దుగుమ్మలు తెగ పోటీపడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు వీళ్ల డేట్స్ కోసం పడిగాపులు గాస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాక తమిళ కన్నడ నాట కూడా వీళ్లు దూసుకుపోతున్నారు. సక్సెస్ కోసం పరుగులు పెట్టే తెలుగు పరిశ్రమ వీళ్లను అస్సలు వదలడం లేదు. వీళ్లిద్దరిలో ఎవరి డేట్స్ దొరికినా చాలు అనుకొనే పరిస్థితి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కాజల్ తమన్నా లాంటి హీరోయిన్ లకు  ఇప్పుడు  పెద్దగా ఆఫర్లు అందడం లేదు. కుర్ర హీరోలు  పూజా  రష్మికా తమ సినిమాల్లో ఉండాల్సిందే అని కోరుకుంటుండటంతో  వారికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్తో పుష్ప.. శర్వానంద్ తో  ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. రష్మికను ఇటీవల గూగుల్ కూడా ఆకాశానికెత్తేసింది. ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా  రష్మికను గుర్తించింది. ఆమెకు తెలుగు తమిళం కన్నడ  నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ రష్మిక మాత్రం కథలు విని.. తనకు నచ్చిన పాత్ర దొరికితేనే చేస్తోందట. కేవలం గ్లామర్ పాత్ర అయితే అస్సలు ఒప్పుకోవడం లేదట.  రష్మికకు తమిళంలో భారీ ఆఫర్ వచ్చినట్టు టాక్. సూర్య తన తర్వాత సినిమాలో రష్మికను ఎంపికచేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ అమ్మడు సూర్య తమ్ముడు కార్తీ ‘సుల్తాన్’ చిత్రంలో చేస్తున్నది. తర్వాత పాండ్యరాజ్ దర్శకత్వంలో సూర్య చేయబోయే భారీ యాక్షన్ చిత్రంలో రష్మికను ఎంపికచేసినట్టు టాక్. పూజా హెగ్డే ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమా పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. దీంతోపాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ సినిమా ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నాయి.