రౌడీ దుస్తులకు మరో బ్రాండ్ అంబాజిడర్!

Wed Jul 17 2019 17:50:50 GMT+0530 (IST)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను రౌడీ అని పిలుస్తున్న విషయం తెలిసిందే.  విజయ్ తన ఫ్యాన్స్ ను రౌడీ బాయ్స్ అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు.  రౌడీ లాంటి పదాన్ని విజయ్ తన దుస్తుల బ్రాండ్ కు కూడా వాడుకుంటున్నాడు. రౌడీవేర్ ఇప్పటికే చాలా పాపులర్ అయింది.  అయితే ఈ రౌడీ బ్రాండ్ లో ఒక కొత్త మార్పు చోటుచేసుకోబోతోందని సమాచారం.రౌడీ బ్రాండ్ లో ప్రస్తుతం మెన్స్ వేర్ మాత్రమే ఉంది. అందుకే విజయ్ వుమన్ వేర్ ను కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడట.  అయితే ఇందుకోసం ఒక లేడీ రౌడీని కూడా ఎంపిక చేసుకున్నాడని సమాచారం.  ఆ లేడీ రౌడీ ఎవరో కాదు.. రష్మిక మందన్న.   ప్రస్తుతం రష్మికతో ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని త్వరలో 'లేడీ రౌడీ' పేరుతో అమ్మాయిల దుస్తులను మార్కెట్ లోకి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట.  రష్మిక ఒకవేళ లేడీ రౌడీ గా మారితే ఈ బ్రాండ్ కు ప్లస్ అవుతుంది. సౌత్ అంతా యూత్ లో భారీ క్రేజ్ ఉంది కాబట్టి వుమన్ వేర్ కూడా పాపులర్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

'గీత గోవిందం' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్- రష్మిక త్వరలో 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  'డియర్ కామ్రేడ్' రిలీజ్ సమయంలోనే విజయ్ ఈ 'లేడీ రౌడీ' దుస్తులను లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్నాడట.