విజయ్ ఫ్యామిలీతో రష్మిక సంక్రాంతి

Mon Jan 17 2022 12:00:23 GMT+0530 (IST)

Rashmika Sankranthi Celebrations with Vijay family

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు చాలా కాలంగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. `గీతగోవిందం`..`డియర్ కామ్రేడ్` చిత్రాల్లో జంటగా నటించిన నాటి నుంచి ఇద్దరి ప్రెండ్ షిప్ కొనసాగుతోంది. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకల్ని కూడా గోవాలో జంటగా జరుపుకున్నారు. ఆ వేడుకల్లో విజయ్ కుటుంబ సభ్యులు అమ్మ-నాన్న-సోదరుడు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ముంబయిలోనూ జంటగా కనిపించారు. తాజాగా సంక్రాంతి వేడుకల్ని కూడా రష్మిక విజయ్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంది. కుటుంబ సబ్యులతో కలిసి పూజాకార్యక్రమాల్లో పాల్గొంది.ఇన్ స్టా వేదికగా సెలబ్రేషన్స్ ఫోటోల్ని విజయ్ అభిమానులకు షేర్ చేసాడు. ఇక్కడో  ఆసక్తికర సంగతి ఉంది. రష్మి-విజయ్ ఒకే రంగు దుస్తులు ధరించి సెంట్రాఫ్ ది అట్రాక్షన్  గా నిలిచారు.  మోరూన్-గోల్డ్ కలర్ దుస్తులు ధరించి ఇద్దరు సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యారు. ఇలా ఫ్యామిలీ  పండుగలో రష్మిక కలవడం ఇదే మొదటిసారి. అయితే సంక్రాంతి పండుగను తెలంగాణలో సెలబ్రేట్ చేయరు. విజయ్ దేవరకొండ తెలంగాణ వాసి. ఆంధ్రాలోనే ఈ పెద్ద పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ విజయ్ ఆంధ్రా వాసి కాకపోయినా రంగుల పండుగను ఘనంగా...రష్మికతో జరుపుకోవడం గమనించదగ్గ విషయం.

గతంలోనే ఇద్దరు లవ్ లో ఉన్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. కానీ అది కేవలం ప్రెండ్ షిప్ మాత్రమేనని..అంతకు మించి  ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా చోటు చేసుకుంటోన్న సన్నివేశాల నేపథ్యంలో మరోసాలి అలాంటి కథనాలకు దారి తీస్తోంది. ఇక వృత్తి పరంగా ఇద్దరు బిజీగా ఉన్నారు. ఇటీవలే `పుష్ప` సినిమాతో రష్మిక పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉంది. `లైగర్` తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నాడు.