Begin typing your search above and press return to search.

రష్మిక పుష్ప 2 డేట్లను పుష్ప కోసం వాడేస్తున్న మైత్రి!

By:  Tupaki Desk   |   3 Dec 2022 2:30 AM GMT
రష్మిక పుష్ప 2 డేట్లను పుష్ప కోసం వాడేస్తున్న మైత్రి!
X
పుష్ప సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు మరింతగా పెంచే విధంగా యూనిట్‌ సభ్యులు లేట్‌ చేస్తున్నారు.

ఇటీవలే పుష్ప 2 సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే పుష్ప 1 యొక్క రష్యన్‌ వర్షన్‌ విడుదల నేపథ్యంలో రష్యా కు వెళ్లారు. మాస్కో లో చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేస్తున్నారు. పుష్ప సినిమా ను రష్యా లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి అక్కడ సాధించబోతున్న కలెక్షన్స్ మరియు టాక్‌ పై ఉంది.

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ తో పాటు హీరోయిన్‌ రష్మిక మందన్నా కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలకు రష్యా వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాదారణంగా విదేశాల్లో పర్యటనకు హీరోయిన్స్‌ చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు. అసలే రష్మిక చాలా బిజీ హీరోయిన్‌. ఆమె డేట్లకు అత్యంత డిమాండ్‌ ఉంది. ఇలాంటి సమయంలో ఆమె పుష్ప సినిమా ప్రమోషన్ కు రష్యా వెళ్లడం విడ్డూరంగా ఉందంటూ టాక్ వినిపిస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా కోసం రష్మిక ఇచ్చిన డేట్ల నుండి పుష్ప 1 యొక్క రష్యన్‌ వర్షన్‌ ప్రమోషన్‌ కోసం వాడేస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 కోసం ఆమె ఇచ్చిన డేట్లను ప్రమోషన్‌ కార్యక్రమాలకు వాడుకోవడం తో ఆమె పాత్ర పుష్ప 1 తో పోల్చితే పుష్ప 2 లో కాస్త తక్కువ ఉండే అవకాశం లేకపోలేదు అంటూ కొందరు ఊహించేస్తున్నారు.

మొత్తానికి పుష్ప 1 ప్రమోషన్‌ కోసం రష్యా కు వెళ్లిన రష్మిక మందన్నా సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. ఆమె కాస్ట్యూమ్స్ మొదలుకుని ప్రతి ఒక్క విషయం కూడా నెట్టింట వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుష్ప 2 డేట్స్‌ అయినా కూడా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లడం అభినందనీయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.