ఫోటో స్టోరీ : ఎలైట్ కోసం రష్మిక సోయగాలు..!

Tue Dec 06 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Photo Story : Rashmika Mandana Ravishing Poses

కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయ్యింది. అమితాబ్ తో గుడ్ బై మూవీ చేసిన రష్మిక మిషన్ మజ్ను కూడా చేసింది. ఆ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఇక సందీప్ వంగ యానిమల్ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ దక్కించుకుంది.తెలుగులో పుష్ప 2 తమిళ్ లో వారసుడు సినిమాలు చేస్తున్న రష్మిక నార్త్ మీడియాను ఎట్రాక్ట్ చేస్తుంది. ముంబైలో రష్మిక కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్ అనిపిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా రష్మిక ఎలైట్ మేగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటో షూట్ చేసింది.

బ్లాక్ టీ షర్ట్ పైన స్వెటర్ ధరించి థై షో చేస్తూ ఆకట్టుకుంది రష్మిక. బాలీవుడ్ కి వెళ్లాక గ్లామర్ డోస్ పెంచేసిన రష్మిక ఎలైట్ మేగజైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ లో రెచ్చిపోయింది. ముఖ్యంగా అమ్మడి థై షో నార్త్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

యాక్టింగ్ టాలెంట్ తో పాటుగా ఇలా గ్లామర్ టాలెంట్ కూడా చేస్తున్న రష్మిక ఛాన్స్ వస్తే అక్కడ కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే చేస్తున్న 3 ప్రాజెక్ట్ లకే హిందీలో రష్మిక సందడి ఓ రేంజ్ లో ఉంది.

ఇక అక్కడ స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్స్ వస్తే మాత్రం రష్మిక డబుల్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. పుష్ప పార్ట్ 2 హిందీలో కూడా సూపర్ హిట్ అవడం కూడా రష్మికకు అక్కడ ఫాలోవర్స్ వచ్చేలా చేసింది. ఎల్లి ఇండియా కోసం ఈ రేంజ్ లో రెచ్చిపోయిన రష్మికని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఆడియన్స్. ఒక పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాలో రష్మిక నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

అమ్మడి అందాలకు ముగ్ధుడు అవ్వని వారు ఎవరైనా ఉంటారా.. నీ అందానికి దాసోహం అవుతున్న హృదయాలు ఎన్నో లాంటి ఎన్నో క్రేజీ కామెంట్స్ తో రష్మిక ఇన్ బాక్స్ మొత్తం నిండిపోతుంది. ముఖ్యంగా రష్మిక సినిమాలతో పాటు ఈక్వల్ గా గ్లామర్ షోతో అదరగొడుతుంది. రాబోయే సినిమాలకు రష్మిక చేస్తున్న ఈ ఫోటో షూట్స్ మరింత మైలేజ్ తెచ్చేలా చేస్తాయని చెప్పొచ్చు.