Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సినిమాలకు ఆమె మోస్ట్‌ వాంటెడ్‌

By:  Tupaki Desk   |   30 July 2021 4:16 AM GMT
పాన్ ఇండియా సినిమాలకు ఆమె మోస్ట్‌ వాంటెడ్‌
X
పాన్ ఇండియా సినిమా అంటే కథతో పాటు సినిమాలో నటించిన హీరో హీరోయిన్‌ మరియు దర్శకుడు అందరు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును కలిగి ఉంటే ఆ సినిమా పై బజ్ ఉంటుంది. ఒక్క భాషకే పరిమితం అయిన హీరో లేదా హీరోయిన్‌ తో పాన్ ఇండియా సినిమా అంటే ఇతర భాషల్లో బజ్ క్రియేట్‌ అవ్వడం అంత సులభం కాదు. రెండు మూడు భాషల్లో అయినా సినిమాలు చేసి గుర్తింపు దక్కించుకున్న వారు పాన్ ఇండియా సినిమాలో నటించడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అలాంటిది రష్మిక మందన్నా తెలుగు తో పాటు తమిళం.. కన్నడం మరియు హిందీ భాషల్లో నటిస్తూ ఉంది. కనుక పాన్‌ ఇండియా హీరోయిన్‌ గా రష్మికను పిలవడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఈ అమ్మడికి తెలుగు లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల నుండి పిలుపు అందుతుంది.

పాన్ ఇండియా సినిమా అంటే ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది కనుక రష్మికను ఎంపిక చేయాలనేలా ఆమె క్రేజ్ ను దక్కించుకుంది. ఇప్పటికే తెలుగు లో రూపొందుతున్న పాన్‌ ఇండియా భారీ చిత్రం పుష్ప లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో నటిస్తూనే మరో వైపు తమిళంలో కన్నడంలో ఇంకా హిందీలో కూడా నటిస్తుంది. హిందీలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ వంటి సూపర్ స్టార్‌ తో నటిస్తుంది. దాంతో ఈమెకు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు విడుదల అయ్యి సక్సెస్‌ అయితే మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం. సక్సెస్ అయినా కాకున్నా కూడా బాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిలో రష్మిక పడుతుంది. కనుక సౌత్‌ లో ఈమె నటించిన సినిమాలకు అక్కడ బజ్‌ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక హిందీలో విడుదల చేయాలనుకున్న సినిమాలకు ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు.

పాన్‌ ఇండియా సినిమా లు చర్చకు వస్తే రష్మికను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చింది. తమిళ హీరో శివ కార్తికేయన్‌ హీరోగా నటించబోతున్న ఆ సినిమా ను తెలుగు మరియు తమిళంలోనే ఒకే సారి తెరకెక్కించి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్‌ ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నారు.

ఈ సమయంలోనే హీరోయిన్‌ గా ముద్దుగుమ్మ రష్మిక మందన్నాను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే అయిదు ఆరు సినిమాలను చేస్తున్న రష్మిక మందన్నా తాజాగా ఈ సినిమాను కూడా చేసేందుకు కమిట్‌ అవ్వడం జరిగిందని సమాచారం అందుతోంది. రష్మిక మందన్నా తెలుగు లో పుష్ప తో పాటు శర్వానంద్‌ తో ఒక సినిమాలో నటిస్తుంది. తమిళంలో మరియు హిందీలో కూడా బిజీ బిజీగా ఈమె సినిమాలను చేస్తూనే ఉంది.