ప్రముఖ వైద్యుడిని కలిసిన రష్మిక.. అసలు ఏమైంది?

Sat Sep 24 2022 12:27:27 GMT+0530 (India Standard Time)

Rashmika Met Dr Gurava Reddy

ఛలో గీత గోవిందం భీష్మ సరిలేరు నీకెవ్వరూ తదితర సినిమాల హిట్లతో కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఇక పుష్ప సూపర్ డూపర్ హిట్‌తో రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది.. ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప 2తోపాటు బాలీవుడ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరసన గుడ్ బై సిద్ధార్థ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను కోలీవుడ్‌లో ఇలయ దళపతి విజయ్ సరసన వైరసు వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. ఇలా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్ ఇంకోవైపు తన సొంత శాండల్‌వుడ్ సినిమాల్లోనూ రష్మిక దుమ్ములేపేస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత బిజీగా ఉన్న నటి రష్మిక అంటే అతిశయోక్తి కాదు.కాగా ఈ భామ తాజాగా హైదరాబాద్‌లో టాప్ హాస్పిటల్ లో ఒకటైన సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత ప్రముఖ కీళ్లు ఎముకల వైద్యుడు గురవారెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ రష్మిక తన వద్దకు వచ్చిందని ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదని త్వరలోనే ఆమె కోలుకుంటుందని తెలుస్తోంది.

"నువ్వు 'సామి..సామి..' అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!" అని మోకాలి నొప్పి అంటూ నా దెగ్గరకు వచ్చిన 'శ్రీవల్లి'కి సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను.. పుష్ప సినిమా చుసిన మొదలు రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడు ఏమో.. అంటూ గురవారెడ్డి పోస్టు చేశారు.

పుష్పలో సామి.. సామి అంటూ మోకాళ్ల మీద బరువంతా వేసి డ్యాన్సు చేయడం వల్లే ఇలా నొప్పులు వచ్చాయని గురవారెడ్డి సరదాగా పోస్టు చేశారు. పుష్ప సినిమాలో రష్మిక నటనకు తాను అభిమానిని అని గురువారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి ఆమెను అభినందించాలని అనుకుంటున్నానన్నారు. ఇప్పుడు శ్రీవల్లి (పుష్పలో రష్మిక పేరు) వచ్చినట్టు భుజం నొప్పితో బన్నీ (అల్లు అర్జున్) కూడా తన వద్దకు వస్తాడేమోనని గురవారెడ్డి సరదాగా తన పోస్టులో పేర్కొన్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక భుజాన్ని పైకి పెట్టుకుని నటించిన సంగతి తెలిసిందే. దాన్ని పేర్కొంటూనే గురవారెడ్డి సరదాగా ఈ విషయాన్ని తన పోస్టులో ప్రస్తావించారు.

మంచి హాస్య చతురుడు చదువరి పుస్తక ప్రియుడైన గురవారెడ్డి ఎముకలు కీళ్ల వ్యాధులు సర్జరీలకు సంబంధించి ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు సీతారామం సినిమాలతో మన ముందుకొచ్చిన రష్మిక.. గుడ్ బై చిత్రంతో మన ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.