Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ స్టార్ కూతురుగా ర‌ష్మిక.. తల్లిదండ్రుల స్పంద‌న ఇదీ

By:  Tupaki Desk   |   15 April 2021 12:30 AM GMT
లెజెండ‌రీ స్టార్ కూతురుగా ర‌ష్మిక.. తల్లిదండ్రుల స్పంద‌న ఇదీ
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటిన ర‌ష్మిక మంద‌న బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ చిత్రాల‌కు సంత‌కాలు చేసి స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. సిద్ధార్థ్ మ‌ల్మోత్రా స‌ర‌స‌న మిష‌న్ మజ్ను చిత్రంలో న‌టిస్తూనే బిగ్ బి అమితాబ్ సినిమా గుడ్ బాయ్ లో అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో అమితాబ్ కుమార్తెగా ర‌ష్మిక న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది.

అయితే బిగ్ బి అంతటి లెజెండ‌రీ స్టార్ సినిమాలో అవ‌కాశం రాగానే ర‌ష్మిక త‌ల్లిదండ్రులు ఏమ‌ని ఫీల‌య్యారు? అంటే దానికి ర‌ష్మిక స్వ‌యంగా స‌మాధానం చెప్పింది. ఈ గొప్ప వార్తపై తన తల్లిదండ్రుల స్పందన గురించి మాట్లాడుతూ-`` నేను గుడ్ బాయ్ లో మిస్టర్ బచ్చన్ సరసన నటించబోతున్నానని నా తల్లిదండ్రులకు తెలియ‌గానే.. వారు దాదాపుగా చేయలేవు.. ఇది న‌మ్మ‌లేం`` అని అన్నార‌ట‌. ``నా తల్లిదండ్రులు అమితాబ్ సార్ కి వీరాభిమానులు. ఎదిగే క్ర‌మంలో ఆయ‌న సినిమాలు చూసి పెరిగారు. నాకు ద‌క్కిన అవ‌కాశం విష‌యంలో చాలా సంతోషిస్తున్నారు!!`` అని ర‌ష్మిక వెల్ల‌డించారు.

ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి ఎలా నేర్పిస్తారో అలా అమ్మా నాన్న నాకు చాలా నేర్పించారు..మంచి పని చేయండి.. శ్రద్ధగా ప్ర‌తిదీ చేయండి! అని నేర్పించార‌ని ర‌ష్మిక తెలిపారు. తొలి బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను విడుదలకు ముందే రష్మిక తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. ఇప్ప‌టికే `నేష‌న‌ల్ క్ర‌ష్ గా ఎదిగేయ‌డ‌మే గాక‌ పాన్-ఇండియా అభిమానుల‌ను ర‌ష్మిక సొంతం చేసుకుంది. సౌత్ లో `పుష్ప`‌తో పాటు ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది.