రష్మిక మందన జిగిల్ జిగిల్ వీడియోలో ట్విస్టు

Tue Jun 28 2022 09:45:15 GMT+0530 (IST)

Rashmika Mandanna Viral Video

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు హిందీ పరిశ్రమలోనూ గొప్ప ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. పుష్ప శ్రీవల్లిగా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తన ఫోటోషూట్లు వీడియోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంది.తాజాగా మరో ఫన్నీ వీడియోని షేర్ చేసింది ఈ బ్యూటీ. మై మనీ డోంట్ జిగిల్ జిగిల్ డ్యాన్స్ ఛాలెంజ్ లో తన స్వంత ట్విస్ట్ ను ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సూపర్ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కళ్లజోడుతో రష్మిక ఎంతో క్యూట్ గా లవ్ లీగా కనిపిస్తోందంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. రష్మిక పోస్ట్ చేసిన ఈ రీల్ లో 'జిగిల్ జిగిల్' ట్రెండ్ ని స్వీకరించడం ఆసక్తికరం. 'పుష్ప: ది రైజ్' నుండి 'సామి సామీ..' హుక్ స్టెప్ ని దీనికోసం ట్రై చేయడం ఇక్కడ ట్విస్ట్. వీడియో గురించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె తాళ్లతో చుట్టి కనిపించడంతో  పప్పెట్ షో తరహా వైబ్ ని క్రియేట్ చేసింది.

రష్మిక మందన్న సినిమాల షూటింగ్ మధ్య ఫన్ ఛాలెంజ్ ట్రై చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఏ సినిమా సెట్లో ఇలా ట్రై చేసిందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అభిమానులు వైరల్ ట్రెండ్ సూపర్ స్వీట్ రెండిషన్ కి రిప్లయ్ గా హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.పెట్ డాగ్ కి విమానం టికెట్ అడిగింది!

షూటింగ్ రోజుల్లో తమ డిమాండ్లను భరించమని నటీమణులు నిర్మాతలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాలుగా చూస్తున్నదే.  స్టార్ డమ్ రేంజును బట్టి  షూట్ డేస్ లో నటీమణులను ప్రసన్నం చేసుకోవడానికి నిర్మాతలు డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.  వరుస బ్లాక్ బస్టర్ లతో జోరుమీదున్న రష్మిక నుంచి ఇలాంటివి ఎదురవుతున్నాయని గుసగుస ఇటీవల వైరల్ అయ్యింది.

బాలీవుడ్- టాలీవుడ్-కోలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తున్న ఈ బ్యూటీ రకరకాల డిమాండ్లు చేస్తోందని గుసగుస వినిపిస్తోంది. రష్మికపై తాజా పుకారు ఏమిటంటే.. ఆమె తన కుక్క కోసం ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయమని అలాగే షూట్ సమయంలో తన కుక్కను షికార్ కి తిప్పాలని ఆమె నిర్మాతలను ఇబ్బంది పెట్టింది! అంటూ గుసగుస వైరల్ అయ్యింది. అయితే ఆ తరువాత రష్మిక తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ పుకార్లను కొట్టి పారేసింది. తన కుక్క ఆరా హైదరాబాద్ ను వదిలి ఎక్కడికీ వెళ్లదని .. హైదరాబాద్ లోనే ఉండటం సంతోషంగా ఉందని పేర్కొంటూ వివరణ ఇచ్చింది.

కెరీర్ సంగతి చూస్తే... బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే 'యానిమల్'లో పరిణీతి చోప్రా స్థానంలో రష్మిక అడుగుపెట్టింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్- అనిల్ కపూర్- బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'యానిమల్' 11 ఆగస్ట్ 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దుల్కర్ సల్మాన్ తదుపరి చిత్రం సీతా రామంలో కూడా రష్మిక మందన్న కీలక పాత్ర పోషించనుంది. వైజయంతి సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్- ప్రియాంకదత్ లు నిర్మిస్తున్నారు. ఇటీవల సీతా రామం టీజర్ విడుదలై ఆకట్టుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను లో నటిస్తోంది.  పుష్ప సీక్వెల్లోను రష్మిక నటిస్తోంది. ఆగస్టులో ఈ సినిమా  ప్రారంభం కానుంది.