రెండేళ్ళు నాలుగు విజయాలు

Wed Feb 26 2020 09:45:00 GMT+0530 (IST)

Rashmika Mandanna Upcoming Movies

హీరోయిన్ కి ఎంత టాలెంట్ ఉన్నా లక్ అనేది కెరీర్ కి కీలకం. అయితే ఇప్పుడు తన లక్ తో టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేస్తుంది కన్నడ బ్యూటీ రష్మిక. బెంగళూర్ నుండి హైదరాబాద్ వచ్చి తెలుగులో 'ఛలో' సినిమా చేసిందీ భామ. ఆ సినిమాకే తెలుగు నేర్చేసుకుంది. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక తెలుగులో పాగా వేసేసింది. వరుసగా అమ్మడికి అవకాశాలు అందాయి.రెండో సినిమా 'గీత గోవిందం' తో స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అవకాశాలు గట్టిగా అందుకుంది. మధ్యలో 'దేవదాస్''డియర్ కామ్రేడ్' సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడికి రావాల్సిన ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడా ఇమేజ్ తోనే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ దూసుకెళ్తుంది.

జనవరిలో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' తో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక లేటెస్ట్ గా 'భీష్మ' మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా రెండు విజయాల్లో కీలక పాత్ర పోషించడం అమ్మడికి కలిసొచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ అందుకొని టాప్ హీరోయిన్ లిస్టు లో చేరి పోయింది. మరి ఆ సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అయితే హీరోయిన్ అమ్మడి కెరీర్ కి ఏ డోఖా ఉండదు.