Begin typing your search above and press return to search.

మరోసారి క్రీడాకారిణి అవతారంలో రష్మిక!

By:  Tupaki Desk   |   27 May 2020 1:00 PM GMT
మరోసారి క్రీడాకారిణి అవతారంలో రష్మిక!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో తప్పనిసరిగా రష్మిక మందన్న పేరు ఉంటుంది. ఈ ఏడాది మొదట్లోనే 'సరిలేరు నీకెవ్వరు' తో ఓ విజయం తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా రష్మిక కెరీర్ ను ఓ మలుపు తిప్పుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే రష్మిక చాలాకాలం క్రితం ఓ తమిళ సినిమా ఒప్పుకుంది. కార్తి హీరోగా 'సుల్తాన్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలలో రష్మిక ఓ క్రీడాకారిణిగా నటిస్తోందని సమాచారం. ఓ అథ్లెట్ క్యారెక్టర్ లో రష్మిక కనిపిస్తుందని అంటున్నారు. ఇలా క్రీడాకారిణిగా నటించడం రష్మికకు ఇది మొదటిసారేమీ కాదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' లో రష్మిక ఓ క్రికెటర్ గా నటించింది. ఆ సినిమా విజయం సాధించలేదు కానీ రష్మిక క్రికెటర్ పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇలా అథ్లెట్ గా నటిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ సినిమా రష్మికకు కోలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. కార్తి నటించిన సినిమాలన్నీ తెలుగులోకి వస్తుంటాయి కాబట్టి ఈ సినిమా కూడా తెలుగులోకి రావడం ఖాయమే. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకుడు. వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.