రష్మిక ఒక సినిమాకు సైన్ చేయాలంటే ఆ రెండు తప్పనిసరి అంటా..!

Mon Jul 06 2020 08:00:01 GMT+0530 (IST)

Rashmika Mandanna On About Her Movie Selection

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్పా చిత్రంను చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు.. భీష్మ చిత్రాలతో హిట్స్ అందుకుని మరే హీరోయిన్ కు దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం వైరస్ భయంతో పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్న రష్మిక సోషల్ మీడియా ద్వారా అలాగే ఇంటర్వ్యూల ద్వారా అభిమానులకు చేరువలోనే ఉంటుంది.తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ సందర్బంగా రష్మిక తన సినిమాల ఎంపిక విషయమై ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను సినిమాలు కమిట్ అయ్యేందుకు ప్రధానంగా రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటాను. నా పాత్రలో ఎమోషన్ డెప్త్ గా ఉండాలి అలాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్‌మెంట్ అందించే విధంగా అయినా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లయితేనే నటించాలని భావిస్తానంటూ పేర్కొంది. తన మొదటి సినిమా కిరాక్ పార్టీ నుండి ఇప్పటి వరకు కూడా ఇదే ఫాలో అవుతున్నట్లుగా పేర్కొంది.