శ్రీవల్లి క్లాసిక్ లుక్ సంథింగ్ స్పెషల్

Mon Jun 27 2022 07:00:01 GMT+0530 (IST)

Rashmika Mandanna Latest Photo

మాసీగా కనిపించాలన్నా.. ఇంతలోనే క్లాస్ లుక్ తో అదరగొట్టాలన్నా రష్మిక మందన తర్వాతే. ఛలో చిత్రంలో ఎంతో క్లాస్ గా కనిపించిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందంలో అంతే చిలిపిదనం నిండిన మోడ్రన్ యువతిగా కనిపించింది. పొగరు ఒగరు ఉన్న అందగత్తెగా కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ ని ఆటపట్టించే ఆకతాయి అల్లరి అమ్మాయిగా మెప్పించింది.కానీ ఆ తర్వాత తన లుక్ ని పూర్తిగా మార్చేసింది. `పుష్ప` చిత్రంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన మరో లెవల్లో ఆకట్టుకుంది. ఇక మాసీగా విలేజీ గాళ్ పాత్రలో రష్మిక ఎంతో స్మార్ట్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. మునుముందు బాలీవుడ్ చిత్రాల్లో వీటన్నిటి కంటే విలక్షణమైన పాత్రల్లో మెప్పించనుంది. ఇటీవల సోషల్ మీడియాల్లో రష్మిక మందన వరుస ఫోటోషూట్లతోనూ అంతే ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా వైట్ అండ్ వైట్ లో క్లాసీ లుక్ తో ఆకట్టుకుంది. రష్మిక టోన్డ్ బాడీ ని వైట్ డ్రెస్ సంథింగ్ స్పెషల్ గా ఎలివేట్ చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.

బచ్చన్ కి వీడ్కోలు చెబుతూ..!

రష్మిక మందన్న ఇంతకుముందే ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో భావోద్వేగంతో ఒక లేఖను రాసింది. ఈ భామ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` చివరి రోజు షూటింగ్ నుండి వరుస ఫోటోలను పంచుకుంది. రష్మిక ఎంతో ఎమోషనల్ అవుతూ.. ``వీడ్కోలు... నా బిడ్డ `గుడ్ బై`కి వీడ్కోలు చెప్పడం ద్వేషం కలిగించేదే.. కానీ అబ్బాయిలు ఈరోజుతో నాకు గుడ్ బై! కోవిడ్ క్రైసిస్ కొనసాగుతున్న క్రమంలోనే మేము ఈ ప్రయాణాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు అయ్యింది. కల్లోలం ఉన్నా అనారోగ్యం అని తెలిసినా కానీ ఏదీ మనల్ని పార్టీలలో పాల్గొనకుండా ఆపలేదు. ఇప్పుడు నేను మీ కోసం వేచి ఉండలేను. గుడ్ బైని నిజంగా ఏమిటో చూడాలంటే వేచి ఉండండి. ఈ చిత్రం చాలా సరదాగా ఉంటుంది! గంభీరంగా నవ్వడానికి సిద్ధంగా ఉండండి! మీరు ఇక్కడ చూసే ప్రతి ఒక్కరూ .. ఈ టీమ్ లో నేను పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు ఎప్పటికీ సూపర్ స్పెషల్ గా ఉంటారు.. అబ్బాయిలూ! త్వరలో మళ్లీ పని చేద్దాం..  నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను! మీరు బెస్ట్!`` అని అంది.

అమితాబ్ బచ్చన్ సార్.. మీతో ఈ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా కృతజ్ఞతతో ఉన్నాను.. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి! #వికాస్ బాల్ .. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.. ఇంత ప్రత్యేకమైన చిత్రంలో నన్ను భాగం చేయడానికి మీరు నన్ను నమ్మడానికి కారణమేమిటో దేవుడికి తెలుసు. నేను ఇప్పటివరకు మిమ్మల్ని గర్వపడేలా చేశానని ఆశిస్తున్నాను`` అంటూ ఎమోషనల్ నోట్ రాసింది.

ఇటీవలే `యానిమల్`లో పరిణీతి చోప్రా స్థానంలో రష్మిక అడుగుపెట్టింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్- అనిల్ కపూర్- బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. `యానిమల్` 11 ఆగస్ట్ 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.