ప్రెండ్స్ గ్యాంగ్ ని పక్కనపెట్టేసావా రష్మిక?

Sun May 22 2022 22:00:01 GMT+0530 (IST)

Rashmika Mandanna Latest Photo

కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్  దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులతో  సక్సెస్  పుల్ గా దూసుకుపోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా లో ఫేమస్ అయింది. దీంతో  బాలీవుడ్ లో సైతం సత్తా చాటడానికి రెడీ అయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో కొన్ని హిందీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాటితో హిట్ కొట్టి  మొల్లగా  హిందీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలన్న ప్రణాళికతో ముందుకు కదులుతుంది.ఇక బ్యూటీ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నెటి జనుల  అటెన్షన్ డ్రా  చేయడంలో అమ్మడి శైలి ప్రత్యేకమైనది. ఫ్యాషన్ ప్రియుల్ని అలరించిడానికి నిరంతరం కొత్త కొత్త ఫోటోలతో  ముందుకొస్తుంటుంది. ఇటీవలే చిన్ననాటి  ప్రాణ స్నేహితురాలు రాగిణి పెళ్లికి హాజరై చేసిన హంగామా మర్చిపోలేనిది.

కూర్గ్ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై  పెళ్లి కూతురుకి తోడి పెళ్లికూతురైపోయింది. సంప్రదాయ కట్టుబొట్టులో ఆకర్షణీయంగా కనిపించింది. తాజాగా అదే మోడల్ దుస్తుల్లో ముస్తాబైన కొత్త ఫోటో ని అభిమానులకు షేర్ చేసింది. ఈసారి సోలోగానే ముందుకొచ్చింది. అమ్మడి  ముఖంలో సంపూర్ణమైన  నవ్వు బ్యూటీకి మరింత వన్నె తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు ఆసక్తికర కామెంట్లతో హీటెక్కిస్తున్నారు.

ఇక రష్మిక మంచి ఫిట్ నెస్ ప్రీక్ అన్న సంగతి తెలిసిందే. నిరంతరం ఫిట్ నెస్ గోల్స్ ని ఫిక్స్ చేసుకుని జిమ్ముల్లో తీవ్ర కసరత్తులు  చేస్తుంటుంది. యోగా-ధ్యానం వంటివి కంపల్సరీ. సమంత- రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్లకు ధీటుగా జిమ్ లో శ్రమిస్తుంటుంది.  ఇద్దరు కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత సమయం జిమ్ కి కేటాయిస్తున్నారు. రూపలావణ్యం చెక్కు చెదరకుండా జాగ్రత్తపడుతుంటుంది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ``పుష్ప దిరూ`ల్ లో నటిస్తోంది. బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`.. `గుడ్ బై` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ కొత్త ప్రాజెక్ట్ `యానిమల్` లోనూ అవకాశం అందుకుంది. ఇందులో రాక్ స్టార్ రణబీర్ కపూర్ సరసన నటిస్తుంది. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు లైనప్ లో ఉన్నట్లు సమాచారం.