Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మైఖేల్ జాక్స‌న్ కి సిస్ట‌ర్ లా

By:  Tupaki Desk   |   24 Nov 2020 5:30 AM GMT
ఫోటో స్టోరి: మైఖేల్ జాక్స‌న్ కి సిస్ట‌ర్ లా
X
అందాల ర‌ష్మిక మంద‌న ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. ఈ భామ ఇటీవ‌ల వ‌రుస‌గా టాలీవుడ్ టాప్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ భారీ పారితోషికం వ‌సూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ తో `స‌రిలేరు నీకెవ్వ‌రు` స‌క్సెస్ అనంత‌రం భారీగా పారితోషికం పెంచేసింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ప్ర‌స్తుతం బ‌న్ని .. ఎన్టీఆర్ లాంటి స్టార్ల స‌ర‌స‌న ఆఫ‌ర్లు అందుకుంది. పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో బ‌న్ని-సుక్కూ టీమ్ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ మూవీలో ర‌ష్మిక‌కు ఆఫ‌ర్ అంటూ క‌థ‌నాలొస్తున్నాయి. ఇస్పీడ్ చూస్తుంటే ర‌ష్మిక కెరీర్ కి మ‌రో ఐదేళ్ల పాటు ఇదే స్పీడ్ ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక‌పోతే ర‌ష్మిక లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ లుక్ ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ఈ అమ్మ‌డు షూటింగ్ కోసం శంషాబాద్ విమానాశ్ర‌యంలో దిగిందిలా. చూస్తుంటే.. ఈ లుక్కే సంథింగ్ స్పెష‌ల్ గా కిక్కు పెంచుతోంది. ట్రెండీగా ఆక‌ర్షిస్తోంది. మైఖేల్ జాక్స‌న్ కే సిస్ట‌ర్ లా ఉందిగా! అంటూ అభిమానులు కామెంట్ల‌తో హీటెక్కించేస్తున్నారు.

నిజ‌మే ఆ లుక్ చూడ‌గానే బోయ్స్ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఆ హ్యాట్ .. మాస్క్ క‌వ‌రింగ్.. ఆ స్టైలిష్ సూట్.. మోకాళ్ల‌పైకి తేలుతున్న ఈ బాట‌మ్ స్టైల్ .. ప్ర‌తిదీ క్లాసిక్ డేస్ జాక్స‌న్ లుక్ నే త‌ల‌పిస్తున్నాయి. మొత్తానికి డిజైన‌ర్ డీప్ థింకింగ్ బిగ్ స‌క్సెస్ అయ్యింద‌నే చెప్పాలి.