టైటిల్ లీక్ చేసిన బ్యూటీ.. సీన్ సీరియస్?

Sat Aug 17 2019 11:18:31 GMT+0530 (IST)

Rashmika Spoiled Their Plans

ఛలో.. గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లని సొంతం చేసుకున్నరష్మిక ప్రస్తుతం తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో స్పీడు పెంచేసింది. ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా మారిపోయింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు`.. నితిన్ తో `భీష్మ`.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించనున్నసినిమాలో ఇప్పటికే రష్మిక నటిస్తోంది. తొలిసారి కార్తి సరసన నటిస్తున్న సినిమాతో తమిళ తంబీలను పలకరించబోతోంది.`రోమియో` ఫేమ్ భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు తెలుగులో `సరిలేరు నీకెవ్వరు`.. భీష్మ చిత్రాల షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా వున్నా తమిళ సినిమాకు కూడా సమయం కేటాయిస్తోంది.`ఖాకీ` తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దానికి తగ్గ స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకు రాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ని ప్రకటించలేదు. అయితే యూనిట్ కి తెలియకుండా రష్మిక ఈ మూవీ టైటిల్ ని  సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేసింది.

లేటెస్ట్ గా ఆన్ లొకేషన్ చిత్రీకరణలో పాల్గొన్న రష్మిక `సుల్తాన్` షూటింగ్ లో ఇది నాలుగవ రోజు అంటూ టైటిల్ పై క్లూ ఇచ్చేయడం విశేషం. `యు డోంట్ గెట్ టు సీ ద లుక్ యో` అని ఆన్ లొకేషన్ పిక్ ని పోస్ట్ చేసి మూవీ టైటిల్ ని తనకు తెలియకుండా తానే బయటపెట్టేసింది. టైటిల్ తెలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ టైటిల్ నే కార్తీ ఫ్యాన్స్ వైరల్ గా ముచ్చటించుకోవడంతో అది కాస్తా చిత్రయూనిట్ కి తెలిసిపోయిందట. మరి అధికారికంగా టైటిల్ ని ప్రకటించకుండానే లీక్ చేసేసిన రష్మికపై చిత్రయూనిట్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో?