Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టులో ర‌ష్మిక‌? ప్ర‌యాణం ఎక్క‌డికో!

By:  Tupaki Desk   |   15 May 2022 9:43 AM GMT
ఎయిర్ పోర్టులో ర‌ష్మిక‌? ప్ర‌యాణం ఎక్క‌డికో!
X
కూర్గ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే బాలీవుడ్ లో తెర‌కెక్కుతోన్న `యానిమ‌ల్` షూటింగ్ లో జాయిన్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. ఇందులో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న రొమాన్స్ చేస్తుంది. సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా షూట్ శ‌ర వేగంగా జ‌ర‌గుతోంది. ప్ర‌స్తుతం మ‌నాలీలో తొలి షెడ్యూల్ జ‌రుగుతుంది.

స్పాట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం ఇటీవ‌ల‌ నెట్టింట వైర‌ల్ గా మారాయి. అందులో ర‌ష్మిక కూడా క‌నిపించింది. మ‌రి ఆ సినిమా షూట్ కి బ్రేక్ ఇంచ్చిందా? లేదా? అన్న‌ది తెలియ‌దుగానీ.. తాజాగా ర‌ష్మిక బెంగుళూరు ఎయిర్ పోర్టులో క‌నిపించింది. బ్లాక్ కల‌ర్ దుస్తులు ధ‌రించి...ఆపైనే వైట్ క‌ల‌ర్ వింటర్ కోట్ చేతుల్లో క‌నిపిస్తుంది.

స‌రిగ్గా కార్ పార్కింగ్ ఏరియాలో ర‌ష్మిక క‌నిపిస్తుంది. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా వెనుక‌వైపు బ్యాగ్.. చేతికి బ్లాక్ క‌ల‌ర్ స్మార్ట్ వాచ్ వేసుకుంది. మ‌రో చేతిలో స్మార్ట్ ఫోన్ తో ద‌ర్శ‌న‌మిస్తుంది. మ‌రి ఈ ప్ర‌యాణం ఎక్క‌డ నుంచి అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి ర‌ష్మిక చేతిలో ఉన్న సినిమా ఇదొక్క‌టే. పుష్ప రెండ‌వ భాగం షూటింగ్ కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.

ఇంకా స్ర్కిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయి. షూట్ మొద‌ల‌య్యే స‌రికి మ‌రికొన్ని నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది. ఈ గ్యాప్ లో రష్మిక` యానిమ‌ల్` షూటింగ్ పూర్తిచేస్తుంది. మ‌రో కొత్త సినిమా చేసుకునే టైమ్ కూడా దొరుకుతుంద‌. కానీ అమ్మ‌డు స్ర్కిప్ట్ ల విష‌యంలో చాలా సెల‌క్టివ్ గా ఉంటుంది.

రెమ్యున‌రేష‌న్ కోసమ‌నో..ఖాళీగా ఉంద‌నో! ప్ర‌తీ సినిమాకి క‌మిట్ కాదు. వ్వాటే బ్యూటీ ఎంపిక వెనుక చాలా పెద్ద క‌థే ఉంటుంది. బాలీవుడ్ లో స్థిర‌ప‌డాలని ప్లాన్ చేసుకుంటుంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డాల‌న్న‌ది ఆమె డ్రీమ్. ఇప్ప‌టికే `మిష‌న్ మ‌జ్ను`..`గుడ్ బై` చిత్రాల్లో న‌టించింది. ఆ సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.