Begin typing your search above and press return to search.

ఛార్మి (X) ర‌ష్మిక‌.. ప‌ప్పీ ఫ్రెండ్షిప్ బావుందే

By:  Tupaki Desk   |   14 Jun 2021 10:30 AM GMT
ఛార్మి (X) ర‌ష్మిక‌.. ప‌ప్పీ ఫ్రెండ్షిప్ బావుందే
X
టాలీవుడ్ లో పెట్ ఫ్రెండ్షిప్ గురించి చాలా స్టోరీలున్నాయి. పూరి జ‌గ‌న్నాథ్ కేవ్ లో పూరిక‌నెక్ట్స్ ఆఫీస్ లో ఛార్మికి ఎంతో ఇష్ట‌మైన పెట్స్ ఉన్నాయి. పూరికి పెట్స్ అన్నా ప‌క్షులు అన్నా ఎంత ప్రేమో తెలిసిన‌దే. కేవ్ లో పూరి పెంపుడు జంతువుల‌తో ఛార్మి స‌ర‌దాగా గ‌డిపే ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఛార్మి ఇంట్లో పెంపుడు పెట్ ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి.

ఇక‌పోతే మ‌హేష్ ఇంట్లో ఉండే పెట్స్ తో వంశీ పైడిప‌ల్లి పెట్ స్నేహం గురించి తెలిసిందే. మ‌హేష్ వంశీ స్నేహితులు. ఆ ఇద్ద‌రి కిడ్స్ స్నేహితులు.. అలానే పెట్స్ మ‌ధ్య స్నేహం ఉంది.

ఇక ఇక్క‌డ ఫోటోలు చూస్తుంటే ఛార్మికి ఎంతో ఇష్ట‌మైన పెట్ తో ర‌ష్మిక ఎంతో ప్రేమించే పెట్ స్నేహం చేసింది. అవి రెండూ ఒక‌దాని ముఖంపై ఒక‌టి ముద్దాడుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే ఎంతో క్యూట్ గా క‌నిపిస్తున్నాయి. ఐట‌మ్ ఆరా మీటైతే అన్న క్యాప్ష‌న్ తో ర‌ష్మిక ఈ ఫోటోల‌ను రివీల్ చేయ‌గా.. అడోర‌బుల్ యాంజెల్ ఫేస్ .. కిస్ ఫేస్ అంటూ ఛార్మి ఈ ఫోటోల‌ను షేర్ చేశారు.

ఆంచీ ముంబై ఫేస్ అంటూ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ పెట్ కి ఛార్మి వెల్ కం చెప్పింది. #పెట్ మామ్ స్మైలింగ్ ఫేస్ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫోటోలను ట్విట్ట‌ర్ లో వైర‌ల్ చేశారు. ఇటీవ‌ల లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ కోసం ఛార్మి.. బాలీవుడ్ సినిమాల షూటింగుల కోసం ర‌ష్మిక మంద‌న ముంబైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డే ఓ చోట మీట‌యిన‌ప్ప‌టి ఫోటోలు ఇవి. పెట్స్ పై వారి ప్రేమ ఈ ఫోటోల్లో స్ప‌ష్ఠ‌మ‌వుతోంది.