Begin typing your search above and press return to search.

నాన్న మీరు నా మూల స్థంభం : రష్మిక

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:50 AM GMT
నాన్న మీరు నా మూల స్థంభం : రష్మిక
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న తన తండ్రితో తనకున్న అనుబంధంను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంది. తండ్రి కొన్ని విషయాల్లో కఠువుగా ఉండటంతో పాటు తమ పిల్లల కోసం చాలా కష్టపడతారు. వారి జీవితాన్ని చాలా విలువైన సమయంను త్యాగం చేస్తారు. అలాంటి తండ్రిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది నా తండ్రిని నేను అర్థం చేసుకునేందుకు తక్కువ సమయం పట్టింది. ఆయన నా కోసం పడ్డ కష్టం గురించి నాకు తెలుసు అంటూ తండ్రిని ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

నేను పుట్టక ముందు నాన్నకు కల వచ్చిందట. ఆ కలో పొడవాటి జుట్టు పెద్ద కళ్లు పొడవైన ముక్కు ఉన్న ఒక పాప ఆయన పొట్ట మీద ఆడుకుంటున్నట్లుగా వచ్చిందట. ఆ కల వచ్చిన కొన్నాళ్లకు నేను పుట్టాను. కాని బిజినెస్‌ కారణంగా నేను చిన్నగా ఉన్న సమయంలో ఆయన ఎక్కువగా దూర ప్రాంతాల్లో ఉండేవారు. నేను కాస్త పెద్ద అయిన తర్వాత హాస్టల్స్‌ లో ఎక్కువగా చదువుకున్నాను. ఇప్పుడు సినిమాల కారణంగా ఆయనకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కాని ప్రస్తుతం నాన్నతో కలిసి బిజినెస్‌ భాగస్వామిని అంటూ చెప్పుకొచ్చింది. నా జీవితానికి మూల స్థంభం నాన్న అంటూ ఎమోషనల్‌ అయ్యింది

ప్రస్తుతం ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే నాన్న మనసులో ఏం ఉందో తెలుసుకుంటే మీ జీవితంలో అధిక ప్రాధాన్యత ఆయనకే ఇస్తారు. పిల్లల కోసం నాన్నలు దూరం వెళ్లి కష్టపడతారు. కొన్ని సార్లు కఠినంగా మనతో ఉన్నా కూడా మనం ఉన్నత స్థాయికి వెళ్లాలి అనేది వారి కోరిక. వాళ్లు చాలా ఎమోషన్స్‌ కలిగి ఉంటారు, కాని వారు ఎమోషన్స్‌ కనిపించకుండా ప్రయత్నిస్తారు అంటూ తండ్రులపై చాలా అద్బుతమైన వ్యాఖ్యలను రష్మిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.