పుష్ప వల్లే ఇదంతా సాధ్యమైంది

Fri Jul 01 2022 17:00:01 GMT+0530 (IST)

Rashmika About Pushpa Film

ఛలో.. గీత గోవిందం సినిమా తో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. మిషన్ మజ్ను మరియు గుడ్ బై సినిమాల్లో ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకున్న వాటి వల్ల బాలీవుడ్ లో ఈ అమ్మడి క్రేజ్ పెద్దగా పెరగిందే లేదు. కాని పుష్ప సినిమా తో ఈమె స్టార్ డమ్ అక్కడ పెరిగింది.అప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన్నా పుష్ప సినిమా తర్వాత శ్రీవల్లిగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించి.. హిందీ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించి హిందీ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రష్మిక మందన్నా చెప్పడంతో పుష్ప సినిమా మరోసారి వైరల్ అవుతోంది.

తాజాగా రష్మిక మందన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కు జోడీగా నటించే అవకాశం కు రావడం కు ప్రధాన కారణం పుష్ప సినిమాలోని తాను పోషించిన శ్రీవల్లి పాత్ర. ఆ సినిమా వల్లే తన కెరీర్ బిగ్ టర్న్ ను తీసుకుంది అన్నట్లుగా రష్మిక మందన్నా పుష్ప సినిమా పై తన అభిమానం ను చూపించింది.

హీరోయిన్ గా తమిళంలో ఇటీవలే విజయ్ కి జోడీగా కూడా ఈ అమ్మడు ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో అవకాశం కూడా పుష్ప వల్లే వచ్చి ఉంటుంది. మొత్తానికి గీత గోవిందం టాలీవుడ్ లో స్టార్ డమ్ కు గుర్తింపు తెచ్చి పెట్టగా.. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో ఈ అమ్మడిని స్టార్ గా నిలబెట్టింది అనడంలో సందేహం లేదు.

పుష్ప సినిమా లో శ్రీవల్లి పాత్రను దర్శకుడు సుకుమార్ డిజైన్ చేసిన తీరు అత్యంత విభిన్నంగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

హీరోయిన్ గా రష్మిక మందన్నాకు ఖచ్చితంగా బాలీవుడ్ లో యానిమల్ తో స్టార్ డమ్ దక్కడం ఖాయం.. అక్కడ సూపర్ స్టార్స్ కూడా రష్మిక మందన్నా తో నటించేందుకు ఆసక్తి కనబర్చడం ఖాయం అంటూ ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు.