స్కూల్ డేస్ నుంచీ అతడంటే ఇష్టం.. ఓపెన్ అయిన రష్మిక!

Tue May 24 2022 14:00:01 GMT+0530 (IST)

Rashmika About Her Love History

కర్ణాటకలో జన్మించిన కన్నడ సోయగం రష్మిక మందన్న గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శాండిల్‌వుడ్ చిత్రాలతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ 'ఛలో' వంటి విజయవంతమైన చిత్రంతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ.. ఆ వెంటనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' చేసి కావాల్సినంత క్రేజ్ యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కెరీర్ మొదలెట్టిన ఐదేళ్లలోనే నేషనల్ క్రష్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు నార్త్ లోనూ నటిస్తోన్న రష్మిక.. రీసెంట్ గా ఓ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది.

ఈ క్రమంలోనే రష్మిక స్కూల్ డేస్ నుంచీ తాను ఇష్టపడుతున్న వ్యక్తి గురించి ఓపెన్ అయింది. ఇంతకీ రష్మిక ఇష్టపడే వ్యక్తి మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. 'స్కూల్ డేస్ నుంచే విజయ్ దళపతి గారంటే ఎంతో ఇష్టం. ఆయన నా అభిమాన హీరో. భారీ స్టార్‌డమ్ ఉన్నప్పటికి విజయ్ గారు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనలోని సింప్లిసిటీ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది.

ఇక ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే నా ఆనందందానికి అవధులు లేకుండా పోయాయి. ఫస్ట్ డే షూటింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశా. ఆ రోజు క్లాప్ కొట్టిన తర్వాత విజయ్‌కు దిష్టి తీసి ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని చాటుకున్నా. దిష్టి తీయగానే విజయ్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెట్‌లో ఉన్న వారంతా తెగ నవ్వేశారు' అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

కాగా విజయ్ దళపతి రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'దళపతి 66' వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక దీంతో పాటు రష్మిక తెలుగులో 'పుష్ప ది రూల్' మలయాళంలో 'సీతారామం' హిందీలో 'మిషన్ మజ్ను' 'గుడ్ బై' చిత్రాల్లో నటిస్తోంది.