మారుతి గురించి చెప్పడానికి మాటల్లేవ్!

Sun Jun 26 2022 21:39:14 GMT+0530 (India Standard Time)

Rashi Khanna In Pakka Commercial Pre Release Event

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో రాశి ఖన్నా ఒకరు. మొదటి నుంచి కూడా రాశి ఖన్నా నిదానమే ప్రధానమన్నట్టుగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చింది. అవకాశాల కోసం తొందరపడుతున్నట్టుగా ఆమె కనిపించదు. అలాంటి రాశి ఖన్నా ఈ  సినిమాలో సీరియల్ ఆర్టిస్టుగా కనిపించనుంది. గతంలో మారుతి దర్శకత్వంలో ఆమె 'ప్రతి రోజూ పండగే' సినిమా చేసింది. అలాగే గోపీచంద్ సరసన నాయికగా 'జిల్' చేసింది. ఈ రెండు సినిమాలు హిట్టే. అలాంటి ఈ కాంబినేషన్లో రూపొందిన ' పక్కా మర్షియల్' జులై 1న వస్తోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మాట్లాడుతూ .. " అందరికీ నమస్కారం .. ముందుగా చిరంజీవికి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆశీస్సులు అందించి మా టీమ్ ను సపోర్ట్ చేయడానికి ఆయన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ  సినిమా నా హార్టుకు చాలా దగ్గరైంది. ఇంతవరకూ నేను చేసిన పాత్రల్లో ఇది ది  బెస్ట్ రోల్ అని చెప్పచ్చు. ఈ సినిమాలో మీరు కొత్త గోపీచంద్ గారిని చూస్తారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనతో కలిసి పనిచేయడం థ్రిల్ గా అనిపించింది.

మారుతి గారిని గురించి చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు .. ఆయన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. బెస్ట్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. ఇందాక  రావు రమేశ్ గారు అన్నట్టుగా ఆడియన్స్ ఎంజాయ్ మెంట్ గురించి మాత్రమే ఆయన ఆలోచన చేస్తుంటారు. 'పక్కా కమర్షియల్' సినిమాలోని పాత్రలను  కూడా ఆయన గొప్పగా మలిచారు.  ఓటీటీల్లో చాలా సినిమాలు వస్తుంటాయి .. కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరు. అందువలన అందరూ థియేటర్ కి వెళ్లి   సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నా కెరియర్ మొదటి నుంచి అల్లు అరవింద్ గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.