హీరో కోసం బెండ్ అయిన రాశీఖన్నా!

Sat Jun 25 2022 16:47:48 GMT+0530 (India Standard Time)

Rashi Khana Promotion Event

హీరో హీరోయిన్ ల మధ్య ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా సరదా సన్ని వేశాలు. సరదా సంఘటనలు జరుగుతుంటాయి. అవి చూసే వారికి మరింత ఫన్ ని క్రియేట్ చేస్తూ నవ్వు పుట్టిస్తుంటాయి. అలాంటి సరదా సంఘటనే శని వారం ఓ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో జరిగి నవ్వులు పూయిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే...



ఈ ఏడాది తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి 'సోగ్గాడే చిన్నినాయన' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అక్కినేని ఫ్యాన్స్ ఆశించిన ఫలితాన్ంని మాత్రం అందించలేకపోయింది. ఈ మూవీ తరువాత నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నాడు.

ఇదే ఏడాది స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే తెలుగులో నాగచైతన్య నపటిస్తున్న లేటెస్ట్ మూవీ 'థాంక్యూ'. 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ మూవీలో రాశిఖన్నా తో పాటు మళవిక నాయర్ అవికా గోర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

జూలై 8న ఈ మూవీని ముందు రిలీజ్ చేయాలని మేకర్స్ డేట్ ని కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఆ డేట్ ని మార్చి మూవీ రిలీజ్ ని జూలై 22కు మార్చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర బీందం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. సినిమా రిలీజ్ కు దాదాపు నెలరోజులు వున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో హోరెత్తిస్తోంది. ప్రస్తుతం టైర్ టు హీరోల సినిమాలకు థియేటర్లు ఫుల్స్ కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కోసం చిత్ర బృందం ప్రమోషన్స్ ని దాదాపు నెల రోజుల ముందే మొదలు పెట్టేసింది.  

ఇందులో భాగంగా హీరో నాగచైతన్య రాశిఖన్నా శనివారం పలు మీడియా వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇదే సమయంలో హీరోయిన్ రాశీఖన్నా 4 ఇంచుల హైట్ వున్న హై హీల్స్ వేసుకుని ప్రమోషన్స్ లో పాల్గొంది. చైతో ఫోటోలకు పోజులిచ్చే సమయంలో తనకంటే హైట్ ఎక్కువగా కనిపించడంతో హీరో కోసం బెండ్ అయ్యే ప్రయత్నం చేసింది. అయితే నాగచైతన్య పరవాలేదంటూ వారించినా రాశిఖన్నా బాగోదని చై పక్కన బెండై ఫొటోలకు పోజులివ్వడం నవ్వులు పూయిస్తోంది. పక్కనే తనని ఇమిటేట్ చేస్తూ చై కామెడీ చేయడంతో.. అదే వీడియోని రాశిఖన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

నేను 4 ఇంచుల హైట్ వున్న హైహీల్స్ వేసుకున్నానని అయితే ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో తన హైట్ కి తగ్గట్టుగా లేకపోవడంతో బెండ్ అయ్యానని అయితే చై మాత్రం అవసరం లేదని యదా విధిగా నిలబడమని చెప్పి జెంటిల్మెన్ అనిపించుకున్నాడని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది.