Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ కుటుంబ స‌భ్యుల‌తో రేర్ మెమ‌రీ..!

By:  Tupaki Desk   |   21 April 2021 8:30 AM GMT
బుట్ట బొమ్మ కుటుంబ స‌భ్యుల‌తో రేర్ మెమ‌రీ..!
X
బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన రాధే శ్యామ్ జూలై 31 న విడుదల కావాల్సి ఉండ‌గా ప్ర‌స్తుత క్రైసిస్ లో డైల‌మా నెల‌కొంది. ఇటలీ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో మెడిక‌ల్ స్టూడెంట్ ప్రేర‌ణ‌గా పూజా క‌నిపించ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

రాధేశ్యామ్ పూర్తి ఎమోషనల్ లవ్ డ్రామా.. ర‌క‌ర‌కాల కాలాదుల్లో ప్రేమికులు తెర‌పై క‌నిపిస్తారు. ప్ర‌భాస్ - పూజా కెమిస్ట్రీ అద్భుతంగా పండింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత ఈ చిత్రం చాలా వరకు హైదరాబాద్ సెట్స్ లోనే చిత్రీకరించారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రేరణ‌ అనే వైద్య విద్యార్థిగా కనిపిస్తుంది. ఆమె ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ప్రమాదానికి గురైన ప్రభాస్ (విక్రమాదిత్య) ను ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆమె సేవ‌లు చూసి ప్రేమలో పడిపోతాడు. ఇది వారిద్దరికీ తొలి చూపులోనే ప్రేమ. ఇది ఎలా? అనేది తెలుసుకోవడానికి సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాలి. ఆ మధ్య‌లో క‌థ‌నం ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల‌ట‌.

సాహో విడుదలై ఏడాదిన్నర అయ్యింది. అప్పటి నుండి కొత్త చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల‌వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో పూజా హెగ్డే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అప్పుడే రెండు మూడు చిత్రాల్లో న‌టించేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ కి రెడీ అవుతుంటే ఈలోగానే ఆచార్య లో త‌న పార్ట్ ని కూడా పూర్తి చేసి త‌దుప‌రి చిత్రాల‌తో పూజా బిజీగా ఉంది. త‌మిళంలో ద‌ళ‌ప‌తి 65లోనూ పూజా న‌టిస్తోంది. ఇంకా రాధేశ్యామ్ రిలీజ్ కి రానే లేదు.

ఇక‌పోతే పూజా లండ‌న్ లో త‌న ఫ్యామిలీ వ్యాపారాల‌ భాగ‌స్వాముల్ని క‌లిసిన‌ప్ప‌టి ఓ ఫోటోని షేర్ చేసింది. ఎల్.ఏ ఫెమిగ్లియా! అంటూ దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. త‌మ వ్యాపార‌ భాగ‌స్వాముల్ని పూజా ప‌రిచ‌యం చేసిన స్పాట్ ఎంతో సుంద‌రంగా సాయంత్రం వెలుగుల్లో మెరిసిపోతూ క‌నిపిస్తోంది.