Begin typing your search above and press return to search.

'ది వారియర్' కోసం ఇస్మార్ట్ బాడీని రెడీ చేసిన రాపో..!

By:  Tupaki Desk   |   20 Jan 2022 2:58 AM GMT
ది వారియర్ కోసం ఇస్మార్ట్ బాడీని రెడీ చేసిన రాపో..!
X
'దేవదాస్' సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని.. ఫస్ట్ మూవీతోనే ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ రామ్ ఎన్ని మాస్ సినిమాలు చేసినా.. చాక్లెట్ బాయ్ లాగే కనిపిస్తూ వచ్చారు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో పూరీ జగన్నాథ్ యువ హీరోని పూర్తిగా అవతారంలోకి తీసుకొచ్చాడు.

ఊర మాస్ లుక్ లోకి మారిపోయిన రామ్.. భారీ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఉస్తాద్ లుక్ అండ్ ఇస్మార్ట్ గెటప్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు రాపో మరోసారి తన బాడీని చూపించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.

రామ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో ''ది వారియర్'' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఉస్తాద్ హీరో క్లీన్ షేవ్ తో ఖాకీ యూనిఫామ్‌ లో అగ్రెసివ్ లుక్ లో కనిపించాడు. రామ్ కెరీర్ లో పోలీస్ గా కనిపించడం ఇదే తొలిసారి. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్ర కోసం రామ్ ఫిజికల్ గా చాలా వర్కవుట్స్ చేసినట్లు తెలుస్తోంది.

పోలీసాఫీసర్ పాత్ర అంటే చాలా ఫిట్ గా కనిపించాల్సి ఉంటుంది. దీని కోసం రామ్ కొన్ని నెలల పాటు జిమ్ లో తీవ్రంగా శ్రమించి బాడీని బిల్డ్ చేసినట్లు తెలిసింది. కండలు తిరిగిన ఆరు పలకల దేహాన్ని కూడా రెడీ చేసారని టాక్. ‘ఇస్మార్ట్ శంకర్’ క్లైమాక్స్ మాదిరిగానే.. 'ది వారియర్' సినిమాలో రామ్ తన బాడీని చూపించబోతున్నారని సమాచారం.

'ది వారియర్' చిత్రంతో కోలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని రామ్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ బైలింగ్విల్ మూవీని నిర్మిస్తున్నారు.