రేప్ కేసు వివాదం.. ముద్దుగుమ్మలు ఒకరికి ఒకరు సారి

Thu Jun 10 2021 15:00:01 GMT+0530 (IST)

Rape case controversy

ఉత్తరాది బుల్లి తెర నటుడు పెర్ల్ వి పూరి రేప్ కేసు సంచలనంగా మారింది. అతడు పలు మార్లు రేప్ చేశాడంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ముంబయి పోలీసులు నటుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే కొందరు పెర్ల్ వి పూరి కు మద్దతుగా మరి కొందరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో బుల్లి తెర ముద్దుగుమ్మలు ఇద్దరు నియా శర్మ మరియు దేవోలీనా భట్టాచార్జీ లు కూడా ఈ చర్చను మరింతగా హీట్ పెంచారు.సోషల్ మీడియాలో నియా శర్మ ఇటీవల పెర్ల్ వి పూరి కు మద్దతుగా నిలిచింది. అమ్మాయిలు అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదు. ఇలాంటి ఆరోపణల వల్ల నిజమైన దోషులకు శిక్ష పడే అవకాశం ఉండదని.. ఈ విషయంలో తాను పెర్ల్ వి పూరి కి పూర్తి మద్దతుగా నిలుస్తాను అంటూ ప్రకటించింది. నియా శర్మ వ్యాఖ్యలపై దేవోలీనా భట్టాచార్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసర ఆరోపణలు అంటూ నియా చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ దేవోలీనా సోషల్ మీడియా ద్వారా దుబయ్యబట్టింది. ఇద్దరి మద్య వైరం మరీ ముదిరింది. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దూషించుకునే వరకు వెళ్లింది.

పరిస్థితి మరీ సీరియస్ అవ్వడంతో నియా శర్మ మరియు దేవోలీనా భట్టాచార్జీలు ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నారు. మొదటగా నియా శర్మ స్పందిస్తూ.. ఈ వివాదాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో క్షమాపణ చెప్పేందుకు ముందుకు వచ్చాను. నాను క్లోజ్ గా భావించే వారు నా వాదనను తప్పుబట్టారు. అందుకే నేను దేవోలీనా భట్టాచార్జీ కి క్షమాపణలు చెబుతున్నాను అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ వివాదం ఇంతటితో ముగియాలని ఆమె భావించింది. నియా శర్మ క్షమాపణను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా దేవోలీనా పేర్కొంది. ఈ విషయంలో తన వాదన కూడా సరిగా లేని కారణంగా నియా శర్మకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంది. మొత్తానికి వీరిద్దరి మద్య మాటల యుద్దం క్షమాపణలతో సర్థుమనిగినట్లయ్యింది.